Share News

సరికొత్త ఆయుధ వ్యవస్థలు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ నుంచి

ABN , Publish Date - Apr 29 , 2026 | 05:39 AM

అధునాతన ఆయుధ వ్యవస్థల తయారీలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తన సత్తా చాటుతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ...

సరికొత్త ఆయుధ వ్యవస్థలు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ నుంచి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అధునాతన ఆయుధ వ్యవస్థల తయారీలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తన సత్తా చాటుతోంది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) టెక్నాలజీతో అభివృద్ధి చేసిన రెండు ప్రత్యేక ఆయుధ వ్యవస్థలను తాజాగా ప్రదర్శించింది. విక్రమ్‌ వీటీ 21, 30ఎంఎం అన్‌మ్యాన్‌డ్‌ టర్రెట్‌లను డీఆర్‌డీవో, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ప్రదర్శించింది. ఇందులో విక్రమ్‌ వీటీ 21 అనేది యుద్ధభూమిలో సైనికులను తీసుకు వెళ్లే అధునాతన ప్లాట్‌ఫామ్‌. డీఆర్‌డీఓ నిర్వహణలోని వెహికల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ ఎస్లాబ్లి్‌షమెంట్‌ (వీఆర్‌డీఈ) వీటిని డిజైన్‌ చేయగా టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ వీటి అభివృద్ధి, తయారీని చేపట్టింది. 30 ఎంఎం అన్‌మ్యాన్‌డ్‌ టర్రెట్‌ కూడా యుద్ధ భూమిలో సైనికులను తీసు కుని వెళ్లేందుకు ఉపయోగపడుతుందని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 05:39 AM