Share News

ట్రూజన్‌ సోలార్‌లో క్రికెటర్ల పెట్టుబడులు

ABN , Publish Date - Mar 11 , 2026 | 06:01 AM

భారత టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, మరో స్టార్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ట్రూజన్‌ సోలార్‌లో...

ట్రూజన్‌ సోలార్‌లో క్రికెటర్ల పెట్టుబడులు

హైదరాబాద్‌: భారత టీ20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, మరో స్టార్‌ క్రికెటర్‌ తిలక్‌ వర్మ హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ట్రూజన్‌ సోలార్‌లో పెట్టుబడులు పెట్టారు. ట్రూజన్‌ సోలార్‌.. సన్‌టెక్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ అనుబంధ సంస్థగా ఉంది. అయితే వీరిద్దరు ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. వీరిద్దరి పెట్టుబడులతో పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో కంపెనీ అభివృద్ధి మరింత ఊపందుకుంటుందని పేర్కొంది. కాగా ట్రూజన్‌ సోలార్‌లో ఇప్పటికే సచిన్‌ టెండూల్కర్‌ పెట్టుబడులు పెట్టారు.

ఇవి కూడా చదవండి..

నష్టాల నుంచి ఉపశమనం.. కోలుకుంటున్న దేశీయ సూచీలు..

ఇరాన్ యుద్ధం.. పెట్రోల్, గ్యాస్, ఎరువుల నిల్వలు సరిపోతాయా..

Updated Date - Mar 11 , 2026 | 06:01 AM