‘సుప్రీం’లో వేదాంతకు చుక్కెదురు
ABN , Publish Date - Nov 17 , 2026 | 06:14 AM
సుప్రీం కోర్టులో వేదాంత గ్రూపు కంపెనీ ట్విన్ స్టార్ టెక్నాలజీస్‌కి చుక్కెదురైంది. దివాలా ప్రక్రియలో ఉన్న వీడియోకాన్...
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో వేదాంత గ్రూపు కంపెనీ ట్విన్ స్టార్ టెక్నాలజీస్‌కి చుక్కెదురైంది. దివాలా ప్రక్రియలో ఉన్న వీడియోకాన్ గ్రూపు కంపెనీల ఆస్తులను కారు చౌకగా రూ.2,962 కోట్లకు కొట్టేయాలన్న ట్విన్ స్టార్ టెక్నాలజీస్ ప్రణాళికకు సర్వోన్నత న్యాయస్థానం బ్రేక్ వేసింది. ఈ పరిష్కార ప్రక్రియ మొత్తాన్ని పునఃపరిశీలించాలని వీడియోకాన్ గ్రూపు కంపెనీలకు రుణాలు ఇచ్చిన రుణదాతల కమిటీ(సీఓసీ)కి ఎన్‌సీఎల్‌ఏటీ నివేదించడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించింది.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!