Share News

పారిశ్రామిక వివాదాలపై ‘సుప్రీం’ కీలక తీర్పు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:04 AM

‘పారిశ్రామిక వివాదాల చట్టం, 2020’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ చట్టం కింద నమోదైన తాజా కేసులకు.. 1978లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ‘పరిశ్రమ’ అనే విస్తృత...

పారిశ్రామిక వివాదాలపై ‘సుప్రీం’ కీలక తీర్పు

న్యూఢిల్లీ: ‘పారిశ్రామిక వివాదాల చట్టం, 2020’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ చట్టం కింద నమోదైన తాజా కేసులకు.. 1978లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ‘పరిశ్రమ’ అనే విస్తృత అర్థం వర్తించదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం 6:3 మెజారిటీతో ఈ తీర్పు ఇచ్చింది. అయితే 1978లో అప్పటి సుప్రీంకోర్టు న్యామూర్తి వీఆర్‌ కృష్ణ అయ్యర్‌ నేతృత్వంలోని ధర్మాసనం ‘పరిశ్రమ’ అనే పదానికి ఇచ్చిన నిర్వచనం మాత్రం ఇప్పటికీ వర్తిస్తుందని తెలిపింది. ప్రస్తుత తీర్పులో తాము 1978నాటి తీర్పును మరింత మెరుగుపరుస్తున్నామే తప్ప మార్చడం లేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. అయితే తమ ప్రస్తుత తీర్పు 1947 నాటి పారిశ్రామిక వివాదాల చట్టం కింద నమోదై ఇప్పటికే పరిష్కారమైన కేసులు, పెండింగ్‌లో ఉన్న కేసులకు వర్తించదని ధర్మాసనం స్పష్టం చేసింది. 2020నాటి పారిశ్రామిక వివాదాల చట్టం కింద నమోదైన కేసులకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. ఈ కేసు తీర్పుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

నీట్‌ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో విచారణ.. ఎన్‌టీఏ సంస్కరణలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం..

పుణెలో దారుణం.. 9 ఏళ్ల బాలికపై హత్యాచారం.. పొరుగింటి యువకుడి అరెస్ట్..

Updated Date - Aug 21 , 2026 | 06:04 AM