ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించిన సుభాష్ చంద్ర
ABN , Publish Date - Sep 24 , 2026 | 04:42 AM
జీ టీవీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు....
న్యూఢిల్లీ: జీ టీవీ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా అంశం కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తన ఆస్తులను విక్రయించకుండా ఐదుగురు సభ్యుల నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై సుభాష్ చంద్ర నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ను ఆశ్రయించారు. దీంతో చంద్ర దరఖాస్తును పరిశీలించిన ఎన్‌సీఎల్‌ఏటీ.. ఈ అప్పీల్‌లో రుణదాతలను కూడా చేర్చాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో మరింత స్పష్టత కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఎన్‌సీఎల్‌టీ నోటీసులు జారీ చేసింది.
ఇవీ చదవండి:
ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ
ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు