జీ సుభాష్ చంద్ర దివాలా కేసులో
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:31 AM
ఎస్సెల్ గ్రూప్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల చైర్మన్ సుభాష్ చంద్రపై నమోదైన దివాలా కేసులో మూడు వారాల్లోగా స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ...
3 వారాల్లో స్పందించండి
సీబీఐ, ఇతరులకు మూడు వారాల గడువిచ్చిన ఎన్‌సీఎల్‌టీ
న్యూఢిల్లీ: ఎస్సెల్ గ్రూప్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థల చైర్మన్ సుభాష్ చంద్రపై నమోదైన దివాలా కేసులో మూడు వారాల్లోగా స్పందించాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇతర పార్టీలను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆదేశించింది. ఈ కేసులో పార్టీలన్నీ విడివిడిగా కాకుండా ఒకే పేపర్‌పై సమాధానం ఇవ్వాలని కోరింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఎన్‌సీఎల్‌టీ డిసెంబరు 9వ తేదీకి వాయిదా వేసింది. ఎల్‌ఐసీ హౌసిం గ్ ఫైనాన్స్ సహా పలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.22,006 కోట్లు చెల్లించకపోవడంతో సుభాష్ చంద్రపై ఈ దివాలా పిటిషన్ దాఖలైంది. తన ఆస్తులను అధికంగా చూపి, తమ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని చెల్లించక పోవడంతో రుణదాతలు ఈ కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రూ.6.5 కోట్లకు సెటిల్ చేయడంపై రుణదాతలు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వరుసగా రెండో రోజూ బంగారం, వెండి ధరలు ఢమాల్..