ధరల పోటు-ద్రవ్యోల్బణం కాటు
ABN , Publish Date - Mar 03 , 2026 | 02:48 AM
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం...
పశ్చిమాసియా సంక్షోభంపై వాణిజ్య వేత్తల మనోగతం
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నదంటున్నారు. ఈ ఉద్రిక్తతల కారణంగా ప్యాకేజింగ్ మెటీరియల్, రవాణా చార్జీలు పెరుగుతాయని, ఇవి వినియోగదారులకు కంటక ప్రాయమే అవుతుందని బిస్కట్ తయారీదారు పార్లే ప్రోడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా అన్నారు. తామందరూ ఈ సంక్షోభం దీర్ఘకాలం కొనసాగదన్న ఆశాభావంతోనే ఉన్నామని చెప్పారు. అయితే మారికో, డాబర్ వంటి ఇతర ఎఫ్‌ఎంసీజీ దిగ్గజాల ప్రతినిధులు మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, కాని పశ్చిమాసియాకు తమ ఎగుమతులు మరీ అంత ఎక్కువగా లేవని మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి అన్నారు.
ఎగుమతులకు అవాంతరాలు రానీయం: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వాణిజ్యంపై పడే ప్రభావాన్ని మదింపు చేసేందుకు ప్రభుత్వం సోమవారం ఎగుమతిదారులతో కీలక సమావేశం నిర్వహించింది. ఎగుమతి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడినా వాటిని అధిగమించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఎగుమతిదారులకు హామీ ఇచ్చింది.
డెమరేజీ చార్జీలు మాఫీ చేయాలి: విమాన కదలికలపై ఆంక్షలు అధికంగా ఉన్నందు వల్ల ప్రస్తుతానికి విమానాశ్రయాల్లో నిలిచిపోయిన వస్తువులపై డెమరేజీ చార్జీలు ఎత్తివేయాలని దుస్తుల ఎగుమతిదారులు ప్రభుత్వాన్ని కోరారు.
ఇవి కూడా చదవండి..
కోల్‌కతాలో సంజూ వీర విహారం.. దాసోహమైన రికార్డులివే..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..