Share News

7 అమెరికన్‌ దిగ్గజ కంపెనీలకు జూన్‌లో రూ.219 లక్షల కోట్ల నష్టం

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:27 AM

అమెరికాలోని 7 లిస్టెడ్‌ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, ఎన్‌విడియా, ఆల్ఫాబెట్‌, యాపిల్‌, మెటా, టెస్లా, అమెజాన్‌ల మొత్తం మార్కెట్‌ విలువ జూన్‌లో 2.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.219 లక్షల కోట్లు) మేర...

7 అమెరికన్‌ దిగ్గజ కంపెనీలకు జూన్‌లో రూ.219 లక్షల కోట్ల నష్టం

న్యూయార్క్‌: అమెరికాలోని 7 లిస్టెడ్‌ దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, ఎన్‌విడియా, ఆల్ఫాబెట్‌, యాపిల్‌, మెటా, టెస్లా, అమెజాన్‌ల మొత్తం మార్కెట్‌ విలువ జూన్‌లో 2.3 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.219 లక్షల కోట్లు) మేర తరిగిపోయింది. ఈ టెక్నాలజీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోవడమే ఇందుకు కారణం. ఎందుకంటే, కృత్రిమ మేధ (ఏఐ) సేవలందించేందుకు ఈ కంపెనీలు చిప్‌ల కొనుగోలు, డేటా సెంటర్ల ఏర్పాటుతో పాటు ఇతర మౌలిక సదుపాయాల కోసం వందల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయి. అప్పులు చేసి మరీ పెడుతున్న పెట్టుబడులపై కంపెనీలకు ఏ మేర, ఎప్పుడు ప్రతిఫలాలు లభిస్తాయన్న అంశాలపై అనిశ్చితి కారణంగా ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లలో భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారని మార్కెట్‌ ఇన్వెస్టర్లు అంటున్నారు. ఈ నెలలో మైక్రోసాఫ్ట్‌ షేరు 20ు క్షీణించగా.. ఎన్‌విడియా స్టాక్‌ 13ు పతనమైంది. యాపిల్‌, అమెజాన్‌ 8ు చొప్పున తగ్గాయి.

ఇవి కూడా చదవండి..

రెండో రోజూ నష్టాలే.. 170 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..

ఓటు హక్కు కోల్పోతే, పథకాలూ కోల్పోతారు.. కర్ణాటక సీఎం హెచ్చరిక..

Updated Date - Jul 01 , 2026 | 06:27 AM