భారత్‌ను దాటిన తైవాన్
ABN , Publish Date - May 28 , 2026 | 02:53 AM
భారత్ జనాభా 147 కోట్ల పైమాటే. అందులో నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్ల పైచిలుకే. మన ఎన్‌ఎస్ఈ ఇన్వెస్టర్లలో కనీసం ఆరో వంతు జనాభా కూడా లేని చిన్న దేశం...
అత్యంత విలువైన స్టాక్ మార్కెట్లలో ఐదో స్థానానికి..
భారత్ జనాభా 147 కోట్ల పైమాటే. అందులో నేషనల్ స్టాక్ ఎక్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ) నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్ల పైచిలుకే. మన ఎన్‌ఎస్ఈ ఇన్వెస్టర్లలో కనీసం ఆరో వంతు జనాభా కూడా లేని చిన్న దేశం తైవాన్ భారత్‌ను తాజాగా ఓ విషయంలో అధిగమించేసింది. ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్లలో భారత్‌ను వెనక్కి నెట్టి తైవాన్ ఐదో స్థానానికి చేరుకుంది. బుధవారం ట్రేడింగ్‌లో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెయిటెడ్ ఇండెక్స్ మరో 1.68 శాతం పెరిగింది. దాంతో ఆ ఎక్స్ఛేంజ్ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరువైంది. మన ఎన్‌ఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 లక్షల కోట్లకు పరిమితమైంది. దాంతో భారత్ ఆరో స్థానానికి జారుకుంది. అమెరికా 77.95 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలో అత్యంత విలువైన స్టాక్ మార్కెట్‌గా కొనసాగుతుండగా.. చైనా (17.75 లక్షల కోట్ల డాలర్లు), జపాన్ (8.7 లక్షల కోట్ల డాలర్లు), హాంకాంగ్ (7.25 లక్షల కోట్ల డాలర్లు) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.
అంతా ‘చిప్’ల మహిమ: ఈ కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో టెక్నాలజీ సేవలు, సెమీకండక్టర్ల (చిప్) తయారీ కంపెనీలదే ఆధిపత్యం నడుస్తోంది. చిప్‌లతో పాటు ఇతర ఎలకా్ట్రనిక్ హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీకి తైవాన్ హబ్ అన్న విషయం తెలిసిందే. ఆ దేశానికి చెందిన తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ (టీఎ్‌సఎంసీ).. ప్రపంచంలోనే అతిపెద్ద కాంట్రాక్ట్ చిప్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ. ఎన్‌విడియా, యాపిల్, ఏఎండీ, క్వాల్‌కామ్ సహా పలు అమెరికన్, అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ కంపెనీల కోసం అత్యాధునిక ఏఐ చిప్‌లు తయారు చేసి పెడుతోంది. గడిచిన ఏడాది కాలంలో ‘టీఎ్‌సఎంసీ’ షేర్లు 130 శాతానికి పైగా పుంజుకోగా.. ఆ దేశ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ ఈ ఏడాదిలో 52 శాతానికి పైగా పెరిగింది. దాంతో తైవాన్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా భారీగా పెరిగింది. కాగా, భారత్ స్టాక్ మార్కెట్ పశ్చిమాసియా సంక్షోభం, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ఉపసంహరణ వంటి ఒత్తిళ్లతో తిరోగమన బాటలో పయనిస్తోంది. ఈ ఏడాదిలో సెన్సెక్స్, నిఫ్టీ 8 శాతానికి పైగానే నష్టపోయాయి.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి.