లాభాల్లోకి మార్కెట్లు
ABN , Publish Date - May 23 , 2026 | 05:46 AM
వరుసగా రెండు రోజులు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొద్దిపాటి లాభాలతో ముగిసాయి...
ముంబై: వరుసగా రెండు రోజులు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కొద్దిపాటి లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 231.99 పాయింట్ల లాభంతో 75,415.35 వద్ద ముగియగా నిఫ్టీ 64.60 పాయింట్ల లాభంతో 23,719.30 వద్ద క్లోజైంది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లతో పాటు కొన్ని బ్లూచిప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు పెరగడంతో సూచీలు లాభాల్లో సాగాయి. కాగా ఈ వారం మొత్తానికి చూసినా సెన్సెక్స్ 177.36 పాయింట్లు, నిఫ్టీ 75.8 పాయింట్ల స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
బిహార్‌కీ ఓ ఐపీఎల్ టీమ్ ఉండాలి: బిలియనీర్ అనిల్ అగర్వాల్
సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్