Share News

మరిన్ని ఆటుపోట్లకు అవకాశం..

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:30 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధం మరింత...

మరిన్ని ఆటుపోట్లకు అవకాశం..

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలోనూ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పశ్చిమాసియా యుద్ధం మరింత ముదరడం, డాలరుతో రూపా యు విలువ పడిపోతుండడం, బాండ్‌ రాబడుల పెరుగుదల ఆందోళన కలిగిస్తున్నాయి. ముడిచమురు ధరలే సూచీల గమనాన్ని నిర్దేశించనున్నాయి. గతవారం ఐటీ, హెల్త్‌కేర్‌ సూచీలు మాత్రమే రాణించాయి.

స్టాక్‌ రికమెండేషన్స్‌

ఓఎన్‌జీసీ: జీవితకాల గరిష్ట స్థాయి నుంచి 45ు మేర పతనమైన ఈ షేరు కీలక మద్దతు స్థాయి రూ.230 నుంచి పుంజుకుని కీలక నిరోధ స్థాయిని దాటింది. చమురు ఇబ్బందుల నేపథ్యంలో ఈ షేర్లపై ఆసక్తి పెరిగింది. గత శుక్రవారం భారీ వాల్యూమ్‌తో 4.3ు లాభంతో రూ.281 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.295/315 టార్గెట్‌ ధరతో రూ.275పై స్థాయిలో ప్రవేశించవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ. 260.

భారతీ ఎయిర్‌టెల్‌: జీవితకాల గరిష్ట స్థాయిని తాకి న తర్వాత ఈ షేర్లలో 18ు మేర కరెక్షన్‌ జరిగింది. రిలేటివ్‌ స్ట్రెంత్‌ ఫర్వాలేదు. కీలకమైన సపోర్టు స్థాయి రూ.1770 వద్ద మూమెంటమ్‌ లభించింది. మంచి వాల్యూమ్‌ కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.1843 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1950/2050 టార్గెట్‌ ధరతో రూ.1800 శ్రేణిలో ప్రవేశించవచ్చు.

స్టాప్‌లాస్‌ : రూ.1760.

హిండాల్కో : గత ఏడాది మే నెల నుంచి ఈ షేర్లు అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. తాజాగా 20ు మేర దిద్దుబాటు జరిగింది. 200 డీఎంఏ వద్ద మద్దతు లభించింది. గత శుక్రవారం రూ.866 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1050 టార్గెట్‌ ధరతో రూ.855 శ్రేణిలో ప్రవేశించవచ్చు. మెటల్‌ రంగానికి డిమాండ్‌ ఉండడం కలిసొచ్చే అంశం. స్టాప్‌లాస్‌ : రూ.835.

కోఫోర్జ్‌: కొన్ని నెలలుగా ఈ షేర్లు డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. జీవితకాల గరిష్టం నుంచి 50ు మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. రూ.1000 వద్ద మద్దతు లభించింది. అక్కడి నుంచి పుంజుకొని 16ు మేర రాణించాయి. రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1144 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1650 టార్గెట్‌ ధరతో రూ.1140 శ్రేణిలో ప్రవేశించవచ్చు.

స్టాప్‌లాస్‌ : రూ.1100.


అదానీ పవర్‌: కొన్ని రోజులుగా ఈ షేర్లు గరిష్ట స్థాయుల్లో కన్సాలిడేట్‌ అవుతున్నాయి. 200 డీఏంఏ వద్ద సపోర్టు తీసుకున్న ఈ షేర్లు స్వల్పకాల నిరోధాన్ని అధిగ మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ క్రమంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం రూ.153 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.175/180 టార్గెట్‌ ధరతో రూ.150 శ్రేణిలో ప్రవేశించవచ్చు. స్టాప్‌లాస్‌ : రూ.145.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 30 , 2026 | 02:30 AM