రూ.6.42 లక్షల కోట్ల సంపద వృద్ధి
ABN , Publish Date - Apr 28 , 2026 | 06:17 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఐటీ రంగ షేర్ల ర్యాలీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల...
3 రోజుల తర్వాత లాభాల్లోకి సూచీలు
639 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
మళ్లీ 24,000 ఎగువకి నిఫ్టీ
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. మార్కెట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, ఐటీ రంగ షేర్ల ర్యాలీతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో మన ప్రామాణిక సూచీలు సోమవారం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 755.83 పాయింట్లు ఎగబాకి 77,420.04 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 639.42 పాయింట్ల లాభంతో 77,303.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 194.75 పాయింట్ల వృద్ధితో 24,092.70 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.6.42 లక్షల కోట్లు పెరిగి రూ.467.91 లక్షల కోట్లకు (4..97 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 24 రాణించాయి. అమెరికన్ హెల్త్‌కేర్ కంపెనీ ఆర్గనాన్‌ను కొనుగోలు చేసిన నేపథ్యంలో సన్‌ఫార్మా షేరు 7.03 శాతం పెరిగి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. రిలయన్స్ షేరు 2.88 శాతం ఎగబాకింది.
ఎన్‌ఎస్ఈ.. 13 కోట్ల ఇన్వెస్టర్లు: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎ్‌సఈ)లో నమోదిత ఇన్వెస్టర్ల సంఖ్య 13 కోట్ల మైలురాయిని దాటింది. 2025 సెప్టెంబరులో 12 కోట్లకు చేరుకున్న ఇన్వెస్టర్లు.. దాదాపు 7 నెలల్లోనే మరో కోటి మేర పెరిగారని ఎన్‌ఎస్ఈ సోమవారం వెల్లడించింది.
ఇవి కూడా చదవండి
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం