నిరంతరం అప్రమత్తత అవసరం
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:54 AM
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదరడంతో ఈ వారం సైతం మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోను కావచ్చు. ఈ నేపథ్యంలో మదుపరులు నిరంత అప్రమత్తత పాటిస్తూ...
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదరడంతో ఈ వారం సైతం మార్కెట్ తీవ్ర ఆటుపోట్లకు లోను కావచ్చు. ఈ నేపథ్యంలో మదుపరులు నిరంత అప్రమత్తత పాటిస్తూ ఎంపిక చేసుకున్న షేర్లలోనే పెట్టుబడులు పెట్టాలి. గత వారంలో అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఫార్మా, హెల్త్‌కేర్, సీపీఎ్‌సఈ, ఎనర్జీ, మెటల్ రంగాలు కాస్త బలం ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమెండేషన్స్
భారతీ ఎయిర్‌టెల్: జీవితకాల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత ఈ షేర్లలో 18ు మేర కరెక్షన్ జరిగింది. రిలేటివ్ స్ట్రెంత్ ఫర్వాలేదు. కీలక మద్దతు స్థాయి రూ.1700 వద్ద మూమెంటమ్ లభిస్తే మళ్లీ జోరు అందుకునే సూచనలున్నాయి. గత శుక్రవారం రూ.1803 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1920 టార్గెట్ ధరతో రూ.1800పై స్థాయిలో ప్రవేశించాలి. స్టాప్‌లాస్ : ’రూ.1775.
టాటా కన్స్యూమర్: స్వల్పకాల గరిష్టం తర్వాత ఈ షేర్లలో మూమెంటమ్ తగ్గింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ స్టాక్స్‌పై ఫోకస్ పెట్టడంతో వీటిపై ఆసక్తి పెరిగింది. రిలేటివ్ స్ట్రెంత్ ఫర్వాలేదు. గత శుక్రవారం భారీ వాల్యూమ్‌తో రూ.1048 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1230 టార్గెట్ ధరతో రూ.1060పై శ్రేణిలో పొజిషన్ తీసుకోవాలి. స్టాప్‌లాస్ : రూ.1020.
థర్మాక్స్: జీవితకాల గరిష్ట స్థాయి తర్వాత ఈ షేర్లు 50ు మేర దిద్దుబాటుకు లోనయ్యాయి. చివరి త్రైమాసిక ఫలితాల నుంచి రిలేటివ్ స్ట్రెంత్, వాల్యూమ్ మెరుగవుతున్నాయి. గత శుక్రవారం రూ.3221 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.3600 టార్గెట్ ధరతో రూ.3200 శ్రేణిలో ప్రవేశించాలి. స్టాప్‌లాస్ : రూ.3140.
ఇప్కా ల్యాబ్స్ : దిద్దుబాటు తర్వాత మంచి బేస్ ఏర్పడింది. గత ఏడాది నవంబర్ నుంచి 25ు మేర రాబడినందించాయి. రిలేటివ్ స్ట్రెంత్ ఒక్కసారిగా మెరుగైంది. గత శుక్రవారం రూ.1561 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1650 టార్గెట్ ధరతో రూ.1500పై స్థాయిలో పొజిషన్ తీసుకోవాలి. స్టాప్‌లాస్ : రూ.1460.
సీపీ ప్లస్ (ఆదిత్యా ఇన్ఫోటెక్) : గత ఏడాది ఆగష్టులో లిస్టయిన ఈ షేరు ఇప్పటి వరకు 75ు మేర రాబడి అందించింది. గరిష్ట స్థాయి తర్వాత దిద్దుబాటుకు లోనైనా నిఫ్టీతో పోలిస్తే మెరుగ్గా రాణిస్తోంది. గత శుక్రవారం రూ.1619 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.1820 టార్గెట్ ధరతో రూ.1600 శ్రేణిలో ప్రవేశించాలి. స్టాప్‌లాస్ : రూ.1560.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా