క్రూడ్ సుడిలో మార్కెట్ మునక
ABN , Publish Date - Mar 20 , 2026 | 03:18 AM
ముడి చమురు ధర భగ్గుమనడంతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు బెంబేలెతాయి. ఇందుకు తోడు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ చైర్మన్ ఆకస్మిక రాజీనామాతో ఆ బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది...
రూ.12.87 లక్షల కోట్ల సంపద ఉఫ్
సెన్సెక్స్ 2,497 పాయింట్లు డౌన్
ఒక దశలో 23,000 దిగువకు నిఫ్టీ
2024 జూన్ తర్వాత అతి పెద్ద పతనం
ముంబై: ముడి చమురు ధర భగ్గుమనడంతో భారత్ సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు బెంబేలెతాయి. ఇందుకు తోడు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ చైర్మన్ ఆకస్మిక రాజీనామాతో ఆ బ్యాంక్ షేరు భారీగా నష్టపోయింది. దాంతో మన ఈక్విటీ సూచీలు కుప్పకూలాయి. బీఎ్‌సఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ ఒకదశలో 2,753.18 పాయింట్లు (3.58్ర) పతనమై ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 73,950.95 పాయింట్లకు దిగజారింది. చివరికి 2,496.89 పాయింట్ల (3.26్ర) నష్టంతో 74,207.24 వద్ద స్థిరపడింది. 2024 జూన్ తర్వాత సెన్సెక్స్ ఒక రోజులో నమోదు చేసిన భారీ నష్టం ఇదే. అలాగే గత ఏడాది ఏప్రిల్ 7 తర్వాత నమోదైన కనిష్ఠ ముగింపు స్థాయి ఇది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా ఒక దశలో 23,000 స్థాయిని కోల్పోయినప్పటికీ.. చివర్లో 775.65 పాయింట్ల (3.26్ర) నికరంగా నష్టంతో 23,002.15 వద్ద ముగిసింది. అమ్మకాలు పోటెత్తడంతో బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.12.87 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.426.13 లక్షల కోట్ల స్థాయికి (4.61 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లూ నష్టపోయా యి. ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేర్లు 5 శాతానికి పైగా నష్టం తో సూచీ టాప్ లూజర్లుగా మిగిలాయి. ఎల్ అండ్ టీ, ఇండిగో, బజాజ్ ఫిన్‌సర్వ్, ట్రెంట్ షేర్లు 4 శాతానికి పైగా తగ్గాయి.
బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 3.34్ర, స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.77ు పతనమయ్యాయి. రంగాలవారీ సూచీలన్నీ నష్టపోగా.. ఆటో ఇండెక్స్ అత్యధికంగా 4.07ు క్షీణించింది. రియల్టీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ, టాప్ టెన్ బ్యాంక్స్, ఇండస్ట్రియల్స్, సర్వీసెస్, ఫోకస్డ్ ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు 3 శాతానికి పైగా తగ్గాయి.
బీఎ్‌సఈలో 4,404 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,359 నష్టపోయాయి. అందులో 368 సంస్థల షేర్లు సరికొత్త ఏడాది కనిష్ఠానికి జారుకోగా.. 7 దిగువ సర్క్యూట్‌ను తాకాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరం గా రూ.7,558.19 కోట్ల విక్రయాలు జరుపగా.. దే శీయ సంస్థాగత పెట్టుబడి దారులు (డీ ఐఐ) 3,863.96 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
ఇంధన షేర్లు విలవిల
క్రూడ్ షాక్‌తో ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీల షేర్లు విలవిల్లాడాయి. కంపెనీల మార్జిన్లకు భారీగా గండిపడవచ్చన్న ఆందోళనలు ఇందు కు కారణం. బీఎ్‌సఈలో హెచ్‌పీసీఎల్ షేరు ఒకదశలో 7.87ు క్షీణించి రూ.321.80 వద్ద కొత్త ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి 7.01 శాతం నష్టంతో రూ.324.80 వద్ద స్థిరపడింది. బీపీసీఎల్ షేరు 5.83ు, ఐఓసీ షేరు 3.91ు నష్టపోయాయి.
సూచీల దారెటు..?
ముడిచమురు ధరలు మరింత ఎగబాకితే బేర్ మరింతగా పట్టు బిగించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర మరో 3-4 నెలల వరకు 100 డాలర్ల ఎగువనే కొనసాగితే, నిఫ్టీ 21,000 స్థాయికి క్షీణించే అవకాశాలు లేకపోలేవని ఎమ్కే గ్లోబల్ అంచనా.
అమీర్ చంద్ షేరు ధర రూ.201-212
హర్యానాకు చెందిన బాస్మతి బియ్యం ఎగుమతిదారు అమీర్ చంద్ జగదీశ్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్ రూ.440 కోట్ల ఐపీఓ ఈనెల 24న ప్రారంభమై 27న ముగియనుంది. ఐపీఓలో షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.201-212గా నిర్ణయించింది.
సూచీల నష్టాలకు కారణాలివీ..
బ్రెంట్ ముడిచమురు ధర 120 డాలర్లకు చేరువ కావడం
చైర్మన్ రాజీనామాతో హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్ షేరు భారీ పతనం
ఇంధన ధరాఘాతంతో మార్కెట్లో వస్తు, సేవల ధరలు మరింత
ప్రియం కావడంతోపాటు ఆర్థిక వృద్ధికి గండిపడవచ్చన్న ఆందోళనలు
ప్రామాణిక వడ్డీ రేట్ల భవిష్యత్‌పై ఫెడ్ రిజర్వ్ కఠిన వైఖరి
అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు మరింత పెరగడం
అంతర్జాతీయ మార్కెట్లు సైతం అమ్మకాల ఒత్తిడికి లోను కావడం
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నిరవధిక పెట్టుబడుల ఉపసంహరణ
రూపాయికి తిప్పలే..!
క్రూడ్ కొండెక్కడంతో రూపాయి మరింత ఒత్తిడికి లోనుకానుందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. చమురు ధరలు దీర్ఘకాలంపాటు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగితే, ఈ ఏడాది చివరిలోగా డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.95కు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. దాంతో ప్రభుత్వంపై దిగుమతుల వ్యయ భారం మరింత పెరగనుంది. కాగా, ఉగాది సందర్భంగా ఫారెక్స్ మార్కెట్ సెలవు పాటించాయి. బుధవారం సెషన్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 49 పైసలు క్షీణించి సరికొత్త జీవనకాల కనిష్ఠ స్థాయి రూ.92.89 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి..
భారత నౌకలను ఇరాన్ అడ్డుకుంటోందా.. కేంద్రం స్పందన ఏంటంటే..
మీ కళ్లు షార్ప్ అయితేనే.. ఈ ఫొటోలో పక్షిని 15 సెకెన్లలో కనిపెట్టగలరు..