Share News

స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో మిలియనీర్లుగా 4,400 మంది ఉద్యోగులు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:19 AM

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష రాకెట్లు, శాటిలైట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ ఐపీఓకు భారీగా డిమాండ్‌ నెలకొంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా...

స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో మిలియనీర్లుగా 4,400 మంది ఉద్యోగులు

న్యూయార్క్‌: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన అంతరిక్ష రాకెట్లు, శాటిలైట్ల తయారీ కంపెనీ స్పేస్‌ఎక్స్‌ ఐపీఓకు భారీగా డిమాండ్‌ నెలకొంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా కంపెనీ తన షేర్లను ఈ నెల 12న అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లో (నాస్‌డాక్‌) నమోదు చేయనుంది. స్పేస్‌ఎక్స్‌ ఐపీఓ ద్వారా మస్క్‌ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారు. అలాగే, కంపెనీకి 4,400 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు మిలియనీర్లుగా మారనున్నారు. అందులో 400 మంది నెట్‌వర్త్‌ ఏకంగా 100 మిలియన్‌ డాలర్లు దాటనుందని న్యూయా ర్క్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. కంపెనీ ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌లో భాగంగా వీరందరూ గతంలో స్పేస్‌ఎక్స్‌ షేర్లను అందుకున్నారని తెలిపింది. ఐపీఓలో భాగంగా స్పేస్‌ఎక్స్‌ 55.56 కోట్ల షేర్లను ఒక్కొక్కటీ 135 డాలర్ల చొప్పున విక్రయానికి పెట్టింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 7,500 కోట్ల డాలర్ల వరకు సమీకరించనుంది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:19 AM