జోరందుకున్న మార్కెట్
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:28 AM
విద్యుత్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఈక్విటీ సూచీలు మూడు రోజుల నష్టాలకు తెర దించి సోమవారం ఒక శాతం పైగా...
సెన్సెక్స్ 650 పాయింట్లు అప్
రూ.3.12 లక్షల కోట్లు పెరిగిన సంపద
ముంబై: విద్యుత్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఈక్విటీ సూచీలు మూడు రోజుల నష్టాలకు తెర దించి సోమవారం ఒక శాతం పైగా దూసుకుపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి స్థిరత్వం, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల నిలకడ ధోరణి కూడా మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. దీంతో సెన్సెక్స్ 650.39 పాయింట్లు లాభపడి 83,277.15 వద్ద ముగిసింది. నిఫ్టీ 211.65 పాయింట్ల లాభంతో 25,682.75 వద్ద క్లోజయింది. బీఎ్‌సఈలో లిస్టింగ్ అయిన కంపెనీల మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.3,11,982.13 కోట్లు పెరిగి రూ.4,68,58,625.33 కోట్లకు (5.17 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్ సూచీ 0.95ు లాభపడగా స్మాల్‌క్యాప్ సూచీ 0.16ు నష్టపోయింది. కన్స్యూమర్ డిస్‌క్రెషనరీ, ఆటో విభాగాల సూచీలు తప్ప రంగాల వారీ సూచీలన్నీ కూడా లాభాల్లోనే ముగిశాయి. పవర్‌గ్రిడ్ షేరు 4.45ు లాభంతో మార్కెట్ జోరులో అగ్రగామిగా నిలిచింది.
ఇవి కూడా చదవండి..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..