Share News

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో మార్కెట్లు

ABN , Publish Date - Jul 07 , 2026 | 02:11 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో సాగాయి. సోమవారం సెన్సెక్స్‌ 521.16 పాయింట్లు పెరిగి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయిలో 78,285.07 పాయింట్ల వద్ద క్లోజైంది...

రెండు నెలల గరిష్ఠ స్థాయిలో మార్కెట్లు

521 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాటలో సాగాయి. సోమవారం సెన్సెక్స్‌ 521.16 పాయింట్లు పెరిగి రెండు నెలలకు పైగా గరిష్ఠ స్థాయిలో 78,285.07 పాయింట్ల వద్ద క్లోజైంది. ఏప్రిల్‌ 22 తర్వాత సెన్సెక్స్‌ ఈ స్థాయికి చేరుకోవటం ఇదే తొలిసారి. బ్లూచిప్‌ బ్యాంకు, ఆయిల్‌ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 634.15 పాయింట్లు పెరిగి 78,398.06కు చేరుకుంది. ఇక ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 159.50 పాయింట్లు పెరిగి 24,430.35 వద్ద క్లోజైంది. ఏప్రిల్‌ 21 నుంచి సూచీ ఈ స్థాయిలో ముగియలేదు. ఇక వరుసగా నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో సెన్సెక్స్‌ 1,806.4 పాయింట్లు (2.36ు), నిఫ్టీ 564.6 పాయింట్లు (2.36ు) పెరిగాయి. కాగా విదేశీ నిధుల ప్రవాహం దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఆశావాహ ట్రెండ్‌కు దోహదపడిందని విశ్లేషకులు చెబుతున్నారు. గత శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,355.33 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేసినట్టు ఎక్స్ఛేంజ్‌ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇక సెన్సెక్స్‌ సూచీలోని హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు అత్యధికంగా 3.59 శాతం పెరిగింది. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు ఒక దశలో 0.82 శాతం తగ్గి 71.53 డాలర్లకు చేరుకుంది.

మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఐపీఓకు ఓకే

మణిపాల్‌ హెల్త్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ ఐపీఓకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.8,000 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. అలాగే ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎఫ్‌) ద్వారా 4.32 కోట్ల వరకు ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు.

లేజర్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ రూ.203-214: ఇంటిగ్రేటెడ్‌ పవర్‌ కేబుల్స్‌ అండ్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రొడక్ట్స్‌ తయారీ సంస్థ లేజర్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ తన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)లో భాగంగా ఒక్కో షేరు ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.203-214గా నిర్ణయించింది. ఈ ఇష్యూ పబ్లిక్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ఈ నెల 9న ప్రారంభమై 13న ముగుస్తుంది.


తగ్గిన బంగారం, వెండి ధరలు: ఢిల్లీ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. సోమవారం 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.1,50,650కి చేరింది. కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,40,000కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల తగ్గుదల, డాలర్‌ మరింత బలపడటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒక దశలో ఔన్స్‌ (31.10 గ్రాములు) స్పాట్‌ బంగారం ధర 4,160.60, వెండి ధర 62.24 డాలర్ల స్థాయిలో ట్రేడయింది.

25 పైసలు తగ్గిన రూపాయి: డాలర్‌ మారకంలో రూపాయి మరింత బలహీనపడింది. సోమవారం 25 పైసలు క్షీణించి రూ.95.43 వద్ద ముగిసింది. డాలర్‌ బలపడటంతో వర్ధమాన మార్కెట్‌ కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్‌ ప్లస్‌ నిర్ణయం

Updated Date - Jul 07 , 2026 | 02:11 AM