ఐటీ షేర్లు జిగేల్..
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:42 AM
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్, నిఫ్టీ..
నాలుగో రోజూ లాభాల్లో సూచీలు
రూ.1.75 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో మధ్యాహ్నం వరకు నష్టాల్లోనే కొనసాగిన సెన్సెక్స్, నిఫ్టీ.. గ్లోబల్ మార్కెట్ సానుకూల సంకేతాలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లతో మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. చివరికి సెన్సెక్స్ 509.73 పాయింట్ల వృద్ధితో 74,616.58 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 1,400 పాయింట్లకు పైగా శ్రేణిలో ఊగిసలాడింది. నిఫ్టీ విషయానికొస్తే, 155.40 పాయింట్ల లాభంతో 23,123.65 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.1.75 లక్షల కోట్ల వృద్ధితో రూ.429.26 లక్షల కోట్లకు (4.62 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 20 రాణించగా.. హెచ్‌సీఎల్ టెక్ షేరు 2.77ు ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. టీసీఎస్, ఇన్ఫీ సైతం 2.68ు వరకు లాభపడ్డాయి. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.18ు నష్టపోగా.. మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీ మాత్రం 0.41ు పెరిగింది. మార్కెట్ లాభాల్లో పయనిస్తున్నా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) మాత్రం నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. మంగళవారం మరో రూ.8,692.11 కోట్ల నికర విక్రయాలు జరిపారు. అదే సమయంలో దేశీయ సంస్థలు రూ.7,979.50 కోట్ల నికర కొనుగోళ్లు జరిపాయి.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 16 పైసల నష్టంతో రూ.93.06 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర ఒక దశలో 110 డాలర్ల పైకి ఎగబాకింది.
ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల ధర రూ.600 తగ్గి రూ.1,53,200కు పరిమితం కాగా.. కిలో వెండి రూ.2,000 తగ్గుదలతో రూ.2.40 లక్షలుగా నమోదైంది. ఒకదశలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం 4,659 డాలర్లు, వెండి 72.14 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్‌లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..