Share News

మార్కెట్లో అనూహ్య రికవరీ

ABN , Publish Date - Apr 07 , 2026 | 03:12 AM

ఈక్విటీ మార్కెట్‌ సోమవారం అనూహ్యంగా అద్భుత రికవరీ సాధించింది. పశ్చిమాసియా యుద్ధానికి తెర దించే క్రమం లో కాల్పుల విరమణకు...

మార్కెట్లో అనూహ్య రికవరీ

787 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ సోమవారం అనూహ్యంగా అద్భుత రికవరీ సాధించింది. పశ్చిమాసియా యుద్ధానికి తెర దించే క్రమం లో కాల్పుల విరమణకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో క్రూడాయిల్‌ ధరలు తగ్గడం ఇందుకు కారణం. రూపాయి బలపడడంతో పాటు ద్వితీయార్ధంలో బ్యాంకింగ్‌, ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడం రికవరీకి ఊతం ఇచ్చింది. సోమవారం ఆరంభంలో సెన్సెక్స్‌ పాజిటివ్‌గానే ప్రారంభమైనా ఇన్వెస్టర్లు లాభాల స్వీకారానికి దిగడంతో రోజంతా భారీ ఆటుపోట్లకు లోనైంది. చివరికి 787.30పాయింట్ల లాభంతో 74,106.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 255.15 పాయింట్లు లాభపడి 22,968.25 వద్ద క్లోజైంది.

14 పైసలు లాభపడిన రూపాయి

ఆర్‌బీఐ చర్యల మద్దతుతో ఫారెక్స్‌ మార్కెట్లో వరుసగా రెండో రోజు సైతం అమెరికన్‌ డాలర్‌ మారకంలో రూపాయి 28 పైసలు బలపడి 92.90 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి 92.79ని తాకింది.

ఈ వార్తలూ చదవండి:

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

ఈసారికి రెపో యథాతథమే!

Updated Date - Apr 07 , 2026 | 03:12 AM