Share News

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

ABN , Publish Date - Jul 03 , 2026 | 02:55 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ 579.48 పాయింట్ల వృద్ధితో 77,502.12 వద్దకు చేరగా.. నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగబాకి...

ఐటీ షేర్లలో జోరుగా కొనుగోళ్లు

సెన్సెక్స్‌ 579 పాయింట్లు అప్‌

రెండో రోజూ లాభాల్లో సూచీలు

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. గురువారం ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ 579.48 పాయింట్ల వృద్ధితో 77,502.12 వద్దకు చేరగా.. నిఫ్టీ 169.85 పాయింట్లు ఎగబాకి 24,175.70 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.32 లక్షల కోట్లు పెరిగి రూ.479.80 లక్షల కోట్ల (5.04 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ముడి చమురు ధరలు మరింత తగ్గడంతో పాటు ఐటీ రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి.

నిఫ్టీ ఐటీ 4.64 శాతం జంప్‌: గత నాలుగు రోజులుగా తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన ఐటీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు వాల్యూ బైయింగ్‌ జరిపారు. దాంతో ఇన్ఫోసిస్‌ ఏకంగా 5.82 శాతం ఎగబాకి నిఫ్టీ-50 టాప్‌ గెయినర్‌గా నిలిచింది. సూచీలోని టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌ షేర్లు 4 శాతానికి పైగా పుంజుకోగా.. విప్రో 2.27 శాతం పెరిగింది. మధ్యస్థాయి ఐటీ కంపెనీలైన పెర్సిస్టెంట్‌, కోఫోర్జ్‌, ఎంఫసిస్‌ సైతం 5 శాతానికి పైగా వృద్ధి చెందాయి. దాంతో టాప్‌ టెన్‌ ఐటీ కంపెనీలతో కూడిన నిఫ్టీ ఐటీ సూచీ 4.64 శాతం లాభపడింది.

ఇవి కూడా చదవండి..

మీ పెంపుడు శక్తులను అదుపులో పెట్టుకోండి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

Updated Date - Jul 03 , 2026 | 02:55 AM