మార్కెట్‌కు ఎన్నికల ఫలితాల దన్ను
ABN , Publish Date - May 05 , 2026 | 05:57 AM
దు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో పాటు ఆశాజనక త్రైమాసిక ఫలితాలు, బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో...
సెన్సెక్స్ 356 పాయింట్లు అప్
మళ్లీ 24,000 ఎగువకు నిఫ్టీ
ముంబై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో పాటు ఆశాజనక త్రైమాసిక ఫలితాలు, బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం లాభాల్లో పయనించాయి. సెన్సెక్స్ ఒక దశలో 997.25 పాయింట్ల వరకు ఎగబాకి 77,910.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం నుంచి ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటంతో చివరికి సూచీ 355.90 పాయింట్ల వృద్ధితో 77,269.40 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 121.75 పాయింట్ల లాభంతో 24,119.30 వద్ద ముగిసింది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.95 లక్షల కోట్లు పెరిగి రూ.467.24 లక్షల కోట్లకు (4.92 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 లాభపడ్డాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) రూ.2,835.62 కోట్లు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) రూ.4,764.16 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
ఈ వార్తలూ చదవండి:
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ జోరు.. సన్ టీవీ షేర్లు పతనం..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..