మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి..
ABN , Publish Date - May 27 , 2026 | 05:13 AM
భారత స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరు స ర్యాలీకి తెరపడింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా మిలటరీ దాడులకు పాల్పడిన...
సెన్సెక్స్ 479 పాయింట్లు డౌన్
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో రెండు రోజుల వరు స ర్యాలీకి తెరపడింది. దక్షిణ ఇరాన్‌లో అమెరికా మిలటరీ దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఇప్పట్లో కుదరకపోవచ్చన్న భయాందోళనలతో పాటు ముడిచమురు ధరలు మళ్లీ పెరగడంతో ఈక్విటీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. దాంతో ప్రామాణిక సూచీ లు మంగళవారం నష్టాల్లో పయనించాయి. ఒక దశలో 579.28 పాయింట్లు క్షీణించి 76,000 స్థాయిని కోల్పోయిన సెన్సెక్స్.. చివరికి 479.26 పాయింట్ల నష్టంతో 76,009.70 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 23,913.70 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి..
ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..