సెన్సెక్స్ 363 పాయింట్లు పతనం
ABN , Publish Date - Jul 24 , 2026 | 02:08 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి....
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో పయనించాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 603 పాయింట్లు పతనమైంది. చివరికి సూచీ 363.66 పాయింట్ల నష్టంతో 76,391.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 126.65 పాయింట్లు కోల్పోయి 23,869.60 వద్దకు జారుకుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ ముడి చమురు బ్యారల్ ధర మరింత ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణమైంది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ మరో రూ.3.32 లక్షల కోట్లు తగ్గి రూ.476.73 లక్షల కోట్లకు (4.94 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 20 పైసలు క్షీణించి రూ.96.73 వద్ద ముగిసింది.
ఈ వార్తలనూ చదవండి:
భారీగా పెరిగిన పసిడి ధరలు.. ప్రస్తుతం మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ముడిచమురు పైపైకి.. కొనసాగుతున్న నష్టాలు..