ముడిచమురు పైపైకి.. కొనసాగుతున్న నష్టాలు..
ABN , Publish Date - Jul 23 , 2026 | 09:49 AM
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
బుధవారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు గురువారం కూడా అదే బాటలో సాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర ప్రస్తుతం 95 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు విదేశీ మదుపర్లు బుధవారం రూ.819 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.51గా ఉంది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,755)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 200 పాయిట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత కిందకు దిగజారింది. ఉదయం 9:45 గంటల సమయంలో సెన్సెక్స్ 308 పాయింట్ల నష్టంతో 76,446 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 85 పాయింట్ల నష్టంతో 23,910 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో ఫోర్స్ మోటార్స్, నాల్కో, వేదాంత, ఆయిల్ ఇండియా, నవుమా వెల్త్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఇండస్ ఇండ్ బ్యాంక్, అదానీ గ్రీన్ ఎనర్జీ, పెట్రోనాట్ ఎల్‌ఎన్‌జీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఒరాకిల్ ఫిన్‌సెర్వ్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 412 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 392 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
నెతన్యాహు ఓ వార్ క్రిమినల్.. అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేయాలి: న్యూయార్క్ మేయర్
పసిడి ధరలు మరికొంత పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..