Share News

ఆఖర్లో అమ్మకాలు

ABN , Publish Date - May 20 , 2026 | 05:31 AM

రోజంతా లాభాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో అమ్మకాల కారణంగా నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల ఇందుకు...

ఆఖర్లో అమ్మకాలు

సెన్సెక్స్‌ 114 పాయింట్లు డౌన్‌

ముంబై: రోజంతా లాభాల్లో కొనసాగిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు.. ఆఖరి గంటలో అమ్మకాల కారణంగా నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనం, చమురు ధరల పెరుగుదల ఇందుకు కారణమయ్యాయి. మంగళవారం లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్‌.. ఒక దశలో 431.23 పాయింట్ల వరకు పెరిగి 75,746.27 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివర్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌ సహా ఇతర బ్లూచిప్‌ షేర్లలో అమ్మకాలతో సూచీ 114.19 పాయింట్ల నష్టంతో 75,200.85 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.95 పాయింట్లు కోల్పోయి 23,618 వద్దకు జారుకుంది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.28 లక్షల కోట్లు పెరిగి రూ.459.65 లక్షల కోట్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎ్‌ఫఐఐ) రూ.2,457.49 కోట్ల నికర విక్రయాలు జరుపగా.. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐ) నికరంగా రూ.3,801.68 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

ఇవి కూడా చదవండి..

గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో ఇరాన్‌పై దాడి వాయిదా.. ట్రంప్ కీలక ప్రకటన

పాపం పాకిస్థాన్.. భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిందట..

Updated Date - May 20 , 2026 | 05:31 AM