Share News

ఆఖరి గంటలో అమ్మకాలు మిశ్రమంగా ముగిసిన సూచీలు

ABN , Publish Date - Jun 11 , 2026 | 03:39 AM

ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను చేజార్చుకుని చివరికి మిశ్రమంగా ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో...

ఆఖరి గంటలో అమ్మకాలు మిశ్రమంగా ముగిసిన సూచీలు

ముంబై: ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో ఆరంభ లాభాలను చేజార్చుకుని చివరికి మిశ్రమంగా ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరులు ఆఖరి గంట ట్రేడింగ్‌లో ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, టెలికాం షేర్లలో భారీగా లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. ఒక దశలో 694.25 పాయింట్లు ఎగబాకి 74,613 వద్ద ఇం ట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్‌.. ట్రేడింగ్‌ నిలిచేసరికి కేవలం 64.42 పాయింట్ల లాభంతో 73,983.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27.15 పాయింట్ల నష్టంతో 23,214.95 వద్దకు జారుకుంది. బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.04 లక్షల కోట్లు తగ్గి రూ.455.52 లక్షల కోట్లకు (4.79 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 12 రాణించగా.. మిగతా 18 నష్టపోయాయి. ఎటర్నల్‌ షేరు అత్యధికంగా 2.46 శాతం క్షీణించింది. బీఎ్‌సఈలోని స్మాల్‌క్యాప్‌ సెలెక్ట్‌, మిడ్‌క్యాప్‌ సెలెక్ట్‌ సూచీలు 1.37 శాతం వరకు నష్టపోయా యి. రంగాలవారీ సూచీల్లో మిడ్‌స్మాల్‌ ప్రైవేట్‌ బ్యాంక్స్‌ క్వాలిటీ టిల్ట్‌ 2.20 శాతం పతనమవగా.. టెలికాం, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రియల్టీ, ఎనర్జీ, పవర్‌, యుటిలిటీస్‌ ఇండెక్స్‌లు 1.5 శాతానికి పైగా క్షీణించాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) రూ.2,124.98 కోట్ల నికర విక్రయాలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి..

అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 11 మంది చిన్నారుల మృతి..

బ్యాంకింగ్ రంగంపై ఆసక్తి.. లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Jun 11 , 2026 | 03:39 AM