76,000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:17 AM
భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ మంగళవారం ఒక దశలో 801 పాయింట్లు ఎగబాకి 76,304 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ...
రెండో రోజూ లాభాల్లో సూచీలు
రూ.2.73 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: భారత స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ మంగళవారం ఒక దశలో 801 పాయింట్లు ఎగబాకి 76,304 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 567.99 పాయింట్ల లాభంతో 76,070.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172.35 పాయింట్ల వృద్ధితో 23,581.15 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మదుపరులు లోహ, వాహన రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. దాంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.73 లక్షల కోట్లు పెరిగి రూ.433.30 లక్షల కోట్లకు (4.69 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 లాభపడగా.. ఎటర్నల్ షేరు 5.70 ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది.
భారత కరెన్సీ సరికొత్త కనిష్ఠానికి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 12 పైసలు నష్టపోయి రూ.92.40 వద్ద ముగిసింది.
విలువైన లోహాల ధరలు పెరిగాయి. కిలో వెండి రూ.6,000 పెరుగుదలతో రూ.2,62,500కు చేరుకోగా.. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1,050 ఎగబాకి రూ.1,61,300 ధర పలికింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒక దశలో 5,003 డాలర్లు, సిల్వర్ 80.46 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
టాటా స్టీల్‌లో ఎన్‌ఐఎన్‌ఎల్ విలీనం: ప్రైవేట్ రంగ ఉక్కు ఉత్పత్తి దిగ్గజం టాటా స్టీల్‌లో నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్‌ఐఎన్‌ఎల్) విలీనం కానుంది. ఈ ప్రతిపాదనకు టాటా స్టీల్ బోర్డు మంగళవారం ఆమోదం తెలిపింది. అలాగే, టాటా స్టీల్ పూర్తి అనుబంధ విభాగమైన టీ స్టీల్ హోల్డింగ్స్ పీటీఈలో 200 కోట్ల డాలర్ల (రూ.18,488 కోట్లు) పెట్టుబడులకూ బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..