ఎఫ్‌పీఐల సెటిల్మెంట్ మరింత సులభం
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:47 AM
న్యూఢిల్లీ: ఎఫ్‌పీఐల సెటిల్‌మెంట్‌ను మరింత సులభతరం చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలు తమ రోజువారీ అమ్మకాలు, కొనుగోళ్లను...
న్యూఢిల్లీ: ఎఫ్‌పీఐల సెటిల్‌మెంట్‌ను మరింత సులభతరం చేస్తూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలు తమ రోజువారీ అమ్మకాలు, కొనుగోళ్లను ట్రేడింగ్ చివర్లో దేనికది విడివిడిగా సెటిల్ చేయాల్సి వస్తోంది. ఇక నుంచి ఏ రోజుకు ఆ రోజు అమ్మకాలు, కొనుగోళ్ల మద్య ఉన్న నికర మొత్తాన్ని సెటిల్ చేస్తే సరిపోతుంది.
ఐపీఓ దరఖాస్తులు సైతం సంక్షిప్తం
ఐపీఓ మార్కెట్‌కు సంబంధించిన కొన్ని మార్పులకూ సెబీ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా ఐపీఓల కోసం కంపెనీలు సమర్పించే భారీ ప్రాస్పెక్టస్‌లను కీలక విషయాలేవీ మినహాయించకుండా, అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తీకరించాలని నిర్ణయించింది. అంతేగాక ఈ ప్రాస్పెక్టస్ కాపీలను ఐపీఓలు జారీ చేసే కంపెనీలు, స్టాక్ ఎక్స్చేంజిలు, మర్చంట్ బ్యాంకుల వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.
ఇండిపెండెంట్ డైరెక్టర్లు బాధ్యతగా వ్యవహరించాలి
హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు చైర్మన్ అతాను చక్రవర్తి రాజీనామా ఇటీవల సష్టించిన కలకలం నేపథ్యంలో సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉండే వారు బాధ్యతగా వ్యవహరించాలని సెబీ చీఫ్ పాండే అన్నారు. వారు ఎలాంటి ఆధారాలు లేకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదన్నారు. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఒక వేళ సంస్థ పనితీరుపై తమకు ఏదైనా అసంతృప్తి ఉన్నట్టయితే దాన్ని బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చునని, అక్కడ పరిష్కారం కాకపోతే తమ వ్యాఖ్యను తీర్మానాల పుస్తకంలో నమోదు చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
పది కేజీల ఎల్పీజీ సిలిండర్లు.. కేంద్రం స్పందన ఏంటంటే..
మెహిదీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదం