Share News

మళ్లీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా షేర్ల బైబ్యాక్‌!

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:22 AM

స్టాక్‌ ఎక్స్ఛేంజీల ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా షేర్ల బైబ్యాక్‌ను మళ్లీ అనుమతించాలని సెబీ భావిస్తోంది. ఇందుకోసం ఒక చర్చా పత్రాన్ని కూడా విడుదల చేసింది...

మళ్లీ స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా షేర్ల బైబ్యాక్‌!

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్స్ఛేంజీల ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా షేర్ల బైబ్యాక్‌ను మళ్లీ అనుమతించాలని సెబీ భావిస్తోంది. ఇందుకోసం ఒక చర్చా పత్రాన్ని కూడా విడుదల చేసింది. నిజానికి ఎప్పటి నుంచో అమల్లో ఉన్న ఈ విఽధానాన్ని సెబీ గత ఏడాది ఏప్రిల్‌లో రద్దు చేసింది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానంతో మళ్లీ ఈ పాత విధానాన్ని అనుమతించాలని సెబీ యోచిస్తోంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానంలో బైబ్యాక్‌లో అమ్మిన షేర్లపై వచ్చే మూలధన లాభాల పన్నును కంపెనీలే భరించాల్సి వచ్చేది. ఈ నెల 1 నుంచి ఈ భారం వాటాదారులకు బదిలీ అయింది. దీంతో మళ్లీ ఈ పాత విధానాన్ని ప్రవేశ పెట్టాలని సెబీ యోచిస్తోంది. ఇందుకోసం విడుదల చేసిన చర్చా పత్రంపై సంబంధిత వర్గాలు ఈ నెల 23లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.

ఇవి కూడా చదవండి...

ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 02:22 AM