Share News

ఎన్ఎస్ఈలో నానో సెకను ట్రేడింగ్‌

ABN , Publish Date - Feb 22 , 2026 | 03:32 AM

ఏప్రిల్‌ 11 నుంచి ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో నానో సెకను ట్రేడింగ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌ చౌహాన్‌...

ఎన్ఎస్ఈలో నానో సెకను ట్రేడింగ్‌

ఏప్రిల్‌ 11 నుంచి అందుబాటులోకి..

న్యూఢిల్లీ: ఏప్రిల్‌ 11 నుంచి ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో నానో సెకను ట్రేడింగ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌ చౌహాన్‌ శనివారం తెలిపారు. తద్వారా భారత్‌ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల కంటే దాదాపు 1000 రెట్ల వేగంతో కూడిన మార్కెట్‌గా అవతరించనుందన్నారు. కరెన్సీ డెరివేటివ్‌ విభాగ ట్రేడింగ్‌ ఇప్పటికే నానో సెకను వేగంతో జరుగుతోందన్నారు. ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లోనూ ఇదే వేగంతో కూడిన ట్రేడింగ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు. ఒక సెకను 100 కోట్ల కోట్ల నానో సెకనులతో సమానం. ఎన్‌ఎ్‌సఈ అర్డర్ల ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని సెకనుకు 10 కోట్ల లావాదేవీల స్థాయికి పెంచనుందన్నారు. ప్రస్తుతం ఎక్స్ఛేంజ్‌ సెకనుకు 50-60 లక్షల ఆర్డర్లను ప్రాసెస్‌ చేస్తోంది.

ఇవీ చదవండి:

'ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా భారత్‌ను సందర్శించాల్సిందే'

ట్రంప్ సంచలన నిర్ణయం.. ప్రపంచం ముందుకు ఏలియన్స్ సీక్రెట్ ఫైల్స్

Updated Date - Feb 22 , 2026 | 03:32 AM