సెప్టెంబరులో ఎన్‌ఎస్ఈ ఐపీఓ
ABN , Publish Date - Jul 07 , 2026 | 02:31 AM
ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) బాహుబలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు ముహూర్తం ఖరారైంది. ఈ ఇష్యూ సెప్టెంబరులో మార్కెట్‌కు రానుంది. ఎన్‌ఎస్ఈ ఈక్విటీలో
రూ.30,000 కోట్ల వరకు సమీకరణ8 త్వరలో రోడ్‌షోలు ప్రారంభం
న్యూఢిల్లీ: ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) బాహుబలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు ముహూర్తం ఖరారైంది. ఈ ఇష్యూ సెప్టెంబరులో మార్కెట్‌కు రానుంది. ఎన్‌ఎస్ఈ ఈక్విటీలో ఆరు శాతానికి సమానమైన 14.89 కోట్ల షేర్లను ఇప్పటికే వాటాలు ఉన్న మదుపరులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) ద్వారా విక్రయించనున్నారు. ఈ ఇష్యూ ద్వారా రూ.30,000 కోట్ల వరకు సమకూరనున్నాయి. ఈ లెక్కన ఎన్‌ఎ్‌సఈ వాల్యుయేషన్ రూ.5 లక్షల కోట్లు మించుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇప్పటి వరకు భారత ఐపీఓ మార్కెట్లో 2024 అక్టోబరులో హ్యుండయ్ మోటార్ ఇండియా జారీ చేసిన రూ.27,870 కోట్ల ఐపీఓనే అతి పెద్ద ఇష్యూ. ఎన్‌ఎ్‌సఈ ఆ రికార్డును తిరగరాయబోతోంది.
2016 నుంచి పెండింగ్
నిజానికి 2016 లోనే ఐపీఓ కోసం ఎన్‌ఎ్‌సఈ సిద్ధమైంది. రూ.10,000 కోట్ల సమీకరణ కోసం అప్పట్లోనే సెబీకి దరఖాస్తు చేసింది. అయితే గవర్నెన్స్ అంశాలు, కో లొకేషన్ కేసుల కారణంగా సెబీ ఇందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు. ఈ ఏడాది ప్రారంభంలో మాత్రమే సెబీ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఎ్‌సఈ బోర్డు ఐపీఓకు ఆమోదం తెలిపింది. గత 17న ఐపీఓ కోసం సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించడంతో సెప్టెంబరులో మార్కెట్‌కు వస్తోంది. ఇష్యూకు సంబంధించి త్వరలోనే రోడ్‌షోలు ప్రారంభించాలని ఎన్‌ఎ్‌సఈ భావిస్తోంది.
20 మంది మర్చంట్ బ్యాంకర్లు
ఈ ఐపీఓను సూపర్ డూపర్ సక్సెస్ చేసేందుకు ఎన్‌ఎ్‌సఈ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఇప్పటికే 20 మంది మర్చంట్ బ్యాంకర్లను నియమించింది. ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు పెద్ద సంఖ్యలో లీగల్ అడ్వైజర్లను ఏర్పాటు చేసింది. అయితే ఈ ఇష్యూలో ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్‌ను ఇంకా నిర్ణయించలేదు. ప్రైస్ బ్యాండ్ నిర్ణయించిన తర్వాత గ్రే మార్కెట్లో దీనిపై బెట్టింగ్ ప్రారంభం కానుంది. ఏదేమైనా ఎన్‌ఎ్‌సఈ ఐపీఓ భారత ఐపీఓ మార్కెట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్ కానుంది.
ఎల్‌ఐసీ దూరం
ఎన్‌ఎస్ఈ ఈక్విటీలో ప్రస్తుతం 1.8 లక్షల మంది వాటాదారు లు ఉన్నారు. అందులో ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసీ అతిపెద్ద వాటాదారు. ప్రస్తుతం ఎన్‌ఎ్‌సఈ ఈక్విటీలో ఈ సంస్థకు 10.72 శాతం వాటా ఉంది. ఇంత పెద్ద వాటా ఉన్నా ఎల్‌ఐసీ ఈ ఓఎ్‌ఫఎ్‌సకు దూరంగా ఉండబోతోంది. మిగతా వాటాదారులైన ఎస్‌బీఐ 2.48 కోట్ల షేర్లను, ఎంఎస్ స్ట్రాటజిక్ (మారిషస్) లిమిటెడ్ 1.6 కోట్ల షేర్లను ఈ ఓఎ్‌ఫఎస్ ద్వారా విక్రయించనున్నాయి. మిగతా వాటాదారులైన కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వె్‌స్టమెంట్ బోర్డు, ఆరండ ఇన్వె్‌స్టమెంట్స్ (మారిషస్) పీటీఈ లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్), జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీఐ), ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తమ వాటాల్లో కొంత భాగాన్ని ఈ ఓఎ్‌ఫఎస్ ద్వారా విక్రయించబోతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ నిర్ణయం
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..