Share News

టెక్‌ వ్యూ 24,600 వద్ద నిరోధం

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:12 AM

నిఫ్టీ గత వారం తొలుత రియాక్షన్‌ను కనబరిచి ఆ తర్వాత మద్దతు స్థాయిలైన 24,000 వద్ద రికవరీ సాధించింది. గత వారం నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో సైడ్‌వేస్‌ ట్రెండ్‌లో సాగిన నిఫ్టీ.. శుక్రవారం మాత్రం...

టెక్‌ వ్యూ 24,600 వద్ద నిరోధం

నిఫ్టీ గత వారం తొలుత రియాక్షన్‌ను కనబరిచి ఆ తర్వాత మద్దతు స్థాయిలైన 24,000 వద్ద రికవరీ సాధించింది. గత వారం నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో సైడ్‌వేస్‌ ట్రెండ్‌లో సాగిన నిఫ్టీ.. శుక్రవారం మాత్రం పటిష్ఠమైన ర్యాలీతో క్లోజైంది. వీక్లీ ప్రాతిపదికన నిఫ్టీ 127 పాయింట్లు లాభపడి 24,330 స్థాయిల్లో క్లోజైంది. ఐదు వారాల అనిశ్చిత, కన్సాలిడేషన్‌ ట్రెండ్‌ అనంతరం నిఫ్టీ నిలకడగా 24,300 ఎగువన క్లోజయి సానుకూల ట్రెండ్‌ను సూచిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే మార్కెట్‌ ప్రధాన నిరోధ స్థాయిలైన 24,600 స్థాయిలకు చేరువలో ఉంది. ఇక్కడ మరోసారి పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకుంటేనే అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తుందా లేదా అనేది తేలుతుంది. మరోవైపు మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలైన 63,000ను అధిగమించిన అనంతరం పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌ను కనబరిచి 600 పాయింట్ల మేర పతనమైంది. స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 120 పాయింట్ల మేర కరెక్షన్‌కు లోనైంది.

బుల్లిష్‌ స్థాయిలు: సానుకూల ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధ స్థాయిలైన 24,475 కన్నా పైన నిలదొక్కుకోవాలి. అప్‌ట్రెండ్‌ కోసం ఈ స్థాయిలకు ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 24,600. ఈ ఏడాది ఏప్రిల్‌ 21న ఏర్పడిన ప్రధాన నిరోధ స్థాయి ఇది. ఇక్కడ నుంచి దాదాపు 1,500 పాయింట్ల మేర కరెక్షన్‌ను చవిచూసింది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి ప్రధాన నిరోధ స్థాయి 25,000.

బేరిష్‌ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ కరెక్షన్‌కు గురయితే తదుపరి మద్దతు స్థాయిలు 24,200 వద్ద ఉంటాయి. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. లేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. తదుపరి మద్దతు స్థాయి 24,000. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండటం మంచిది.


బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 475 పాయింట్లతో రికవరీ కనబరిచి 58,520 వద్ద క్లోజైంది. తదుపరి నిరోధ స్థాయి 59,000. తదుపరి దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ఒకవేళ కరెక్షన్‌ను కనబరిస్తే తదుపరి మద్దతు స్థాయి 58,000. రక్షణ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఇక్కడ నిలదొక్కుకోకపోతే స్వల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి.

పాటర్న్‌: నిఫ్టీ 24,600 వద్ద మేజర్‌ టాప్‌ను ఏర్పరచుకుంది. ఇది నాలుగు నెలల్లో ఏర్పరచుకున్న గరిష్ఠ స్థాయి. సానుకూలత కోసం 24,600 వద్ద అడ్డంగా దిగువకు ఏర్పడిన నిరోధ ట్రెండ్‌లైన్‌’ వద్ద బ్రేకౌట్‌ను సాధించాల్సి ఉంటుంది.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళవారం మైనర్‌ రివర్సల్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,475, 24,600

మద్దతు : 24,200, 24,000

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:12 AM