Share News

టెక్‌ వ్యూ మద్దతు స్థాయి 23000 వద్ద పరీక్ష

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:51 AM

గత వారం నిఫ్టీ ప్రారంభంలో 24,000 స్థాయిలో మైనర్‌ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత బలహీతను మరింతగా కొనసాగిస్తూ ముందు వారంతో పోల్చితే 1300 పాయింట్ల నష్టంతో...

టెక్‌ వ్యూ మద్దతు స్థాయి 23000 వద్ద పరీక్ష

గత వారం నిఫ్టీ ప్రారంభంలో 24,000 స్థాయిలో మైనర్‌ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత బలహీతను మరింతగా కొనసాగిస్తూ ముందు వారంతో పోల్చితే 1300 పాయింట్ల నష్టంతో 23,150 సమీపంలో క్లోజయింది. గత మూడేళ్ల కాలంలో ఒక వారంలో నిఫ్టీ ఇంత భారీగా నష్టపోవడం ఇదే ప్రథమం. గత మూడు వారాల్లో నిఫ్టీ 3,000 పాయింట్ల మేరకు నష్టపోయింది. మిడ్‌క్యాప్‌-100 సూచీ 2,630 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 ఇండెక్స్‌ 600 పాయింట్ల మేరకు నష్టపోయాయి. ప్రస్తుతం నిఫ్టీ కీలక మానసిక అవధి 23,000 సమీపంలో ఉంది. ప్రపంచ ధోరణుల కారణంగా నిఫ్టీ ఈ వారంలో కూడా అప్రమత్త ట్రెండ్‌లోనే ట్రేడ్‌ కావచ్చు.

బుల్లిష్‌ స్థాయిలు: గత మూడు వారాల్లో అన్ని మద్దతు స్థాయిలను ఛేదించుకుంటూ పడిపోతున్న నిఫ్టీ ఎక్కడ మద్దతు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. సానుకూలత కోసం ఇండెక్స్‌ 23,000 స్థాయిలో కన్సాలిడేట్‌ కావలసి ఉంది. ప్రధాన నిరోధం 23,500. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి.

బేరిష్‌ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయి 23,000 వద్ద విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ఇతర ప్రధాన మద్దతు స్థాయిలు 22700, 22500. ఇక్కడ కన్సాలిడేట్‌ కావచ్చు.

బ్యాంక్‌ నిఫ్టీ: గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌ ప్రదర్శించి 4,000 పాయింట్ల మేరకు దిగజారిన ఈ సూచీ 53,700 వద్ద ముగిసింది. గతంలో ఏర్పడిన మేజర్‌ బాటమ్‌ 53,500కి చేరువవుతోంది. సానుకూలత కోసం ఇక్కడ కచ్చితంగా కన్సాలిడేట్‌ కావాలి. లేదంటే మరింత బలహీనపడుతుంది. రికవరీ బాట పడితే నిరోధ స్థాయి 55,000 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం స్వల్పకాలిక ఓవర్‌సోల్డ్‌ స్థితిలో ప్రవేశిస్తోంది. ఈ కారణంగా టెక్నికల్‌ పునరుజ్జీవానికి ఆస్కారం ఉంది. సానుకూలత కోసం 23,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. దీర్ఘకాలిక వార్షిక చార్టుల ప్రకారం నిఫ్టీ 10 సంవత్సరాల తర్వాత (2016 తర్వాత) ఇప్పుడు రియాక్షన్‌లో పడింది.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 23,350, 23,500

మద్దతు : 23,000, 22,910

వి. సుందర్‌ రాజా

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 12:51 AM