టెక్ వ్యూ 26,000 స్థాయిలో గట్టి పరీక్ష
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:15 AM
గత వారం నిఫ్టీ గరిష్ఠ స్థాయిల్లో మైనర్ అప్‌ట్రెండ్ కనబరిచినప్పటికీ 25,880 స్థాయిల్లో బలమైన రియాక్షన్ సాధించింది. 26,000 వద్ద అప్రమత్తతకు ఇది సంకేతం. నిఫ్టీ గత వారం మొత్తం మీద 100 పాయింట్ల...
26,000 స్థాయిలో గట్టి పరీక్ష
గత వారం నిఫ్టీ గరిష్ఠ స్థాయిల్లో మైనర్ అప్‌ట్రెండ్ కనబరిచినప్పటికీ 25,880 స్థాయిల్లో బలమైన రియాక్షన్ సాధించింది. 26,000 వద్ద అప్రమత్తతకు ఇది సంకేతం. నిఫ్టీ గత వారం మొత్తం మీద 100 పాయింట్ల లాభంతో 25,570 వద్ద ముగిసింది. ఎన్నో నెలల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోలేకపోతోంది. గత మూడు నెలల్లోనే 26,000 పాయింట్ల వద్ద మూడు సార్లు నిఫ్టీ విఫలమయింది. మార్కెట్ మరోసారి ఈ నిరోధం వద్ద పరీక్ష ఎదుర్కొనవచ్చు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం వల్ల సోమవారం నిఫ్టీ కాస్తంత పై స్థాయిలోనే పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చు. సానుకూలత కోసం నిలదొక్కుకోవడం తప్పనిసరి.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ కాస్తంత పై స్థాయిలో ప్రారంభమయ్యే ఆస్కారం ఉన్నందు వల్ల ఆటుపోట్లు ఎదుర్కొనవచ్చు. వ్యత్యాసం కూడా భారీగా ఉండవచ్చు. ప్రధాన నిరోధం 25,900 వద్ద కన్సాలిడేట్ కావచ్చు. ఈ స్థాయిని బ్రేకౌట్ చేసినట్టయితే సానుకూలత కోసం మానసిక అవధి 26,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: మైనర్ మద్దతు స్థాయి 25,600 వద్ద విఫలమైతే మైనర్ బలహీనత ప్రదర్శిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 25,600, 25,500, 25,400. మూడో ప్రధాన మద్దతు స్థాయి 25,400 వద్ద కూడా విఫలమైతే స్వల్పకాలిక బలహీనతగా భావించి అప్రమత్తం కావాలి.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ మాత్రం గత వారం వెయ్యి పాయింట్ల మేరకు ర్యాలీ సాధించి జీవితకాల గరిష్ఠ స్థాయి 61,170 వద్ద పటిష్ఠంగా క్లోజయింది. పాజిటివ్‌గా ప్రారంభమైతే ప్రధాన నిరోధం, మానసిక అవధి 62,000 వద్ద నిలదొక్కుకోవాలి. విఫలమైనా భద్రత కోసం మద్దతు స్థాయి 61,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి.
పాటర్న్: మార్కెట్ 100, 200 డిఎంఏల వద్ద నిరంతరం పరీక్ష ఎదుర్కొంటోంది. సానుకూలత కోసం ఈ స్థాయిల కన్నా పైన నిలదొక్కుకోవాలి. అలాగే సానుకూలత కోసం 26,000 స్థాయిలో ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 25,830, 25,900
మద్దతు : 25,600, 25,500
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్