పాతాళం నుంచి రికవరీ పథంలోకి...
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:36 AM
స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ గురువారం కనివిని ఎరుగని రికవరీ సాధించి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ అయితే ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 2,000 పాయింట్ల మేరకు కోలుకుంది....
ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో అద్భుత పునరుజ్జీవం
22,700 పైన స్థిరపడిన నిఫ్టీ
152 పైసలు లాభపడిన రూపాయి
ముంబై: స్టాక్ మార్కెట్, కరెన్సీ మార్కెట్ గురువారం కనివిని ఎరుగని రికవరీ సాధించి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ అయితే ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 2,000 పాయింట్ల మేరకు కోలుకుంది. పశ్చిమాసియా కల్లోలంతో అథఃపాతాళానికి జారుకున్న మన కరెన్సీ రూపాయి కూడా ఆర్‌బీఐ చర్యల ఉత్తేజంతో ఇంట్రాడేలో 188 పైసలు లాభపడింది.
ఆదుకున్న ఐటీ, బ్యాంకింగ్
ఇరాన్‌పై దాడులు ఉదృతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో సెన్సెక్స్, నిఫ్టీ భారీ కుదుపునకు లోనయ్యాయి. సెన్సెక్స్ 1,588 పాయింట్లు నష్టపోయి ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 71,545.81ని తాకింది. ఇరాన్ యుద్ధానికి ఇప్పట్లో మోక్షం ఉండదన్న భయాలతో ఆసియా మార్కెట్లలో అమ్మకాలు పోటెత్తడంతో అవి నష్టాల్లోకి జారుకున్నాయ. ఇన్వెస్టర్లు భారీ ఎత్తున అమ్మకాలకు దిగారు. ట్రంప్ వ్యాఖ్య ల ప్రభావంతో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ క్రూడాయిల్ 7.28ు పెరిగి 108.52 డాలర్లకు చేరింది. ఈ దశలో ఐటీ దిగ్గజాలైన హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐపీఐసీఐ బ్యాంక్ షేర్లలో విలువ ఆధారిత కొనుగోళ్లు జరగడంతో ఈక్విటీ మార్కెట్ రికవరీ బాట పట్టింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి అనూహ్యంగా భారీ లాభాలు నమోదు చేయడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ విశేషంగా మెరుగుపడింది. ఫలితంగా ముగింపు సెషన్‌లో 73,568.54 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్ చివరికి 185.23 పాయింట్ల లాభంతో 73,319.55 వద్ద ముగిసింది. 496.85 పాయింట్ల ఇంట్రాడే నష్టం నుంచి కోలుకున్న నిఫ్టీ చివరికి 33.70 పాయింట్ల లాభంతో 22,713.10 వద్ద క్లోజైంది.
కుంగిన బులియన్ మార్కెట్
బులియన్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో ముగిసింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.9,000 దిగజారి రూ.2.37 లక్షల వద్ద ముగిసింది. 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,500 నష్టంతో రూ.1.51 లక్షలు పలికింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాము లు) వెండి 7.32ు దిగజారి 68.57 డాలర్లు పలుకగా బంగారం 3,51ు నష్టంతో 4,591.52 వద్ద ముగిసింది.
సాయి పేరెంటరల్స్ దూకుడు
ఇటీవల తొలి పబ్లిక్ ఇష్యూ ముగించుకున్న హైదరాబాద్‌కు చెందిన సాయి పేరెంటరల్స్ షేర్లు గురువారం స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.392తో పోల్చితే బీఎ్‌సఈలో 3.32ు లాభంతో రూ.405 వద్ద లిస్టయిన ఈ షేరు ఇంట్రాడేలో 6.17ు లాభంతో ఇంట్రాడే హై రూ.416.20ని తాకింది. చివరికి 3.67ు లాభంతో రూ.406.40 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో సైతం ఈ షేరు ఇదే దూకుడు ప్రదర్శిస్తూ 3.32ు లాభంతో రూ.405 వద్ద ముగిసింది.

12 ఏళ్ల చరిత్రలో
రూపాయికి అతిపెద్ద లాభం
ఫారెక్స్ మార్కెట్లో భారీ ఆటుపోట్లను నివారించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) బుధవారం రాత్రి ప్రకటించిన చర్యలతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి నిరంతర క్షీణత కు తెరపడింది. పుష్కర కాలంలో బలమైన రికవరీ నమోదు చేసింది. గురువారం ఉదయం డాలర్ మారకంలో 94.62 వద్ద ప్రారంభమైన రూపాయి ఇంట్రాడేలో 188 పైసలు లాభపడి 92.82ని తాకింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 152 పైసల లాభంతో 93.18 వద్ద ముగిసింది. అంతకు ముందు గత శుక్రవారం రూపాయి ఒక దశలో 95 కన్నా దిగజారినప్పటికీ చివరికి చారిత్ర కనిష్ఠ స్థాయి 94.84కి పడిపోయింది. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి రూపాయి 4 శాతం నష్టపోయింది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2026 ఆర్థిక సంవత్సరంలో డాలర్‌తో రూపాయి కనివిని ఎరుగని రీతిలో 10ు వరకు నష్టపోయింది.
నేడు సెలవు
గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. ఈక్విటీ, ఫారెక్స్ మార్కెట్లు పని చేయవు.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News