టెక్ వ్యూ మద్దతు స్థాయిలు 22450, 22000
ABN , Publish Date - Mar 30 , 2026 | 02:27 AM
గత వారం సైతం నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ఇండెక్స్ డౌన్‌ట్రెండ్‌లో ట్రేడ్ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు...
గత వారం సైతం నిఫ్టీ డౌన్‌ట్రెండ్‌ను కొనసాగించింది. ఇండెక్స్ డౌన్‌ట్రెండ్‌లో ట్రేడ్ కావడం వరుసగా ఇది ఐదో వారం. వారం మొత్తం మీద 295 పాయింట్ల మేరకు నష్టపోయి కీలక స్థాయి 23,000 కన్నా దిగువన ముగిసింది. ఒక దశలో ఈ స్థాయిలో కోలుకుంటున్నట్టే కనిపించినా తిరిగి విఫలమై బలమైన కరెక్షన్‌కు లోనయింది. మార్కెట్ గత కొద్ది వారాలుగా భారీ ఎగుడుదిగుడులు చవి చూస్తోంది. 23,000 వద్ద రెండు వారాల మైనర్ రికవరీ అనంతరం అంతకన్నా దిగువన 22,820 వద్ద ముగియడం మరింత అప్రమత్త సంకేతం. మార్చిలో నెల మొత్తం మీద నిఫ్టీ 10ు మేరకు నష్టపోయింది. గత కొద్ది సంవత్సరాల్లో ఏర్పడిన భారీ కరెక్షన్ ఇదే. మిడ్‌క్యాప్-100, స్మాల్‌క్యాప్-100 సూచీలు సైతం కరెక్షన్ కొనసాగించాయి. ఈ వారంలో మార్కెట్ 22450-22500 స్థాయిలో పరీక్ష ఎదుర్కొనవచ్చు.
బుల్లిష్ స్థాయిలు: మార్కెట్ భారీ ఆటుపోట్లకు లోనవుతున్నందు వల్ల స్థిరత్వం ఏర్పడిన తర్వాత మాత్రమే స్పష్టమైన నిరోధ, మద్దతు స్థాయిలు బయటకు వస్తాయి. ప్రస్తుత స్థాయిలో ఏ మాత్రం బలహీనత ప్రదర్శించినా సానుకూలత కోసం 22,450 వద్ద కన్సాలిడేట్ కావాలి. ప్రధాన నిరోధం 23,000. సానుకూలత కోసం ఆ పైన నిలదొక్కుకోవాలి.
బేరిష్ స్థాయిలు: ప్రధాన మద్దతు స్థాయి 22,450 వద్ద విఫలమైతే మరింత బలహీనతను ప్రదర్శిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 22,000. ఇక్కడ కన్సాలిడేట్ కావచ్చు.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ సైతం బేరిష్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వారం మొత్తం మీద 1150 పాయింట్లు నష్టపోయి 52,275 వద్ద ముగిసింది. ప్రధాన మద్దతు స్థాయి 51,500 వద్ద తప్పనిసరిగా కన్సాలిడేట్ కావాలి. మరో ప్రధాన మద్దతు స్థాయి 51,000. ఇక్కడ స్వల్పకాలిక కన్సాలిడేషన్ ఉండవచ్చు. రికవరీ బాట పడితే సానుకూలత కోసం నిరోధ స్థాయి 52,000 వద్ద నిలదొక్కుకోవాలి.
పాటర్న్: సానుకూలత కోసం 22,450 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకుని తీరాలి. డెయిలీ చార్టుల్లో ఓవర్‌సోల్డ్ స్థితి కారణంగానే గత వారం మైనర్ రికవరీ కనిపించింది. వీక్లీ చార్టుల్లో ఓవర్‌సోల్డ్ పొజిషన్ కొనసాగుతోంది.
టైమ్ : ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 23,000; 23,200
మద్దతు : 22,600; 22,450
వి. సుందర్ రాజా
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు