టెక్ వ్యూ 24,400 వద్ద రికవరీకి అవకాశం
ABN , Publish Date - Aug 31 , 2026 | 03:11 AM
నిఫ్టీ గత వారం 24,400-24,000 మధ్యన పరిమిత శ్రేణిలో కదలాడి చివరకు వీక్లీ ప్రాతిపదికన 76 పాయింట్లు నష్టపోయి 24,175 వద్ద స్థిరపడింది. నిఫ్టీ గత మూడు వారాలుగా 24,800 గరిష్ఠ స్థాయిల నుంచి...
నిఫ్టీ గత వారం 24,400-24,000 మధ్యన పరిమిత శ్రేణిలో కదలాడి చివరకు వీక్లీ ప్రాతిపదికన 76 పాయింట్లు నష్టపోయి 24,175 వద్ద స్థిరపడింది. నిఫ్టీ గత మూడు వారాలుగా 24,800 గరిష్ఠ స్థాయిల నుంచి కరెక్షన్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ వస్తోంది. గత నాలుగు వారాల్లో దాదాపు 800 పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ గత వారం ప్రధాన మానసిక అవధి స్థాయిలైన 24,000 వద్ద రికవరీ సాధించినప్పటికీ అనిశ్చిత ట్రెండ్‌ను సూచిస్తోంది. టెక్నికల్‌గా చూస్తే ఈ వారం ఈ స్థాయిల వద్ద పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది. స్వల్పకాలిక అప్‌ట్రెండ్ కోసం 24,400 స్థాయిల వద్ద నిలదొక్కుకోవాలి. మిడ్ క్యాప్ ఇండెక్స్ గరిష్ఠ స్థాయిలైన 64,450 స్థాయిల వద్ద రియాక్షన్‌ను కనబరిచినప్పటికీ 333 పాయింట్ల లాభంతో 64,000 స్థాయిల వద్ద క్లోజైంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 100 పాయింట్లు లాభపడి 20,000 స్థాయిలకు ఎగువన ముగిసింది.
బుల్లిష్ స్థాయిలు: సానుకూల ట్రెండ్ కోసం మేజర్ నిరోధ స్థాయిలైన 24,400 పైన నిలదొక్కుకోవాలి. ఇది రెండు వారాల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి. అప్‌ట్రెండ్ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. తదుపరి స్వల్పకాలిక నిరోధ స్థాయి 24,700. ఇక్కడ నిలదొక్కుకుంటే తదుపరి నిరోధ స్థాయిలు 25,000 ఎగువన ఉంటాయి.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ బలహీనతను సూచిస్తే 24,000 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. సానుకూలత కోసం ఇక్కడ కచ్చితంగా నిలదొక్కుకోవాలి. గడిచిన రెండు వారాల్లో ఈ స్థాయిల నుంచి రికవరీ కనబరిచింది. ఈ స్థాయిల వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 265 పాయింట్లు నష్టపోయి 57,500 వద్ద క్లోజైంది. గత కొద్ది వారాలుగా గరిష్ఠ స్థాయిలైన 58,000 నుంచి రియాక్షన్‌ను కనబరుస్తూ వస్తోంది. కనిష్ఠ స్థాయిలైన 57,000 నుంచి రికవరీ సాధిస్తూ వస్తోంది. సానుకూలత ఈ వారం నిరోధ స్థాయిలైన 58,000 ఎగువన నిలదొక్కుకోవాలి. తదుపరి నిరోధ స్థాయి 58,700. ఇది మూడు నెలల క్రితం ఏర్పడిన గరిష్ఠ స్థాయి. ఒకవేళ బలహీనతను సూచిస్తే 57,000 దిగువన ప్రధాన మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే స్పల్పకాలిక బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి.
పాటర్న్: నిఫ్టీ గత ఐదు నెలలుగా రేంజ్ మూవ్‌మెంట్ ప్యాట్రన్‌లో కదలాడుతోంది. ప్రస్తుతం 50, 100 రోజుల చలన సగటు స్థాయిల వద్ద కదులుతోంది. సానుకూలత కోసం వచ్చే కొద్ది రోజులు ఇక్కడ పటిష్ఠతను సూచించాల్సి ఉంటుంది.
టైమ్: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,320, 24,400
మద్దతు : 24,080, 24,000
వి. సుందర్ రాజా
ఇవి కూడా చదవండి..
బ్యాంకులు, ఆసుపత్రులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లి రిజిస్ట్రేషన్.. చైనాలో ఎందుకిలా చేస్తున్నారంటే..
పెళ్లి రద్దు చేశారని దారుణం.. యువతి, ఆమె సోదరిపై యాసిడ్ దాడి..