టెక్ వ్యూ 22,400 వద్ద నిలదొక్కుకుంటేనే..
ABN , Publish Date - Oct 26 , 2026 | 04:10 AM
23,000 స్థాయిల వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత వెంటనే కరెక్షన్‌లోకి జారుకుంది. గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ 3 శాతం కరెక్షన్‌తో...
నిఫ్టీ గత వారం ఆరంభంలో
23,000 స్థాయిల వద్ద నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత వెంటనే కరెక్షన్‌లోకి జారుకుంది. గత వారం బలమైన డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ 3 శాతం కరెక్షన్‌తో 22,400 స్థాయిలకు పడిపోయింది. చివరకు శుక్రవారం మైనర్ రికవరీతో 22,600 వద్ద క్లోజైంది. వీక్లీ ప్రాతిపదికన 550 పాయింట్లు నష్టపోయింది. గత వారం నిఫ్టీ అంచనాలను మించి కరెక్షన్‌ను కనబరిచినప్పటికీ ఇటీవలి కనిష్ఠ స్థాయిలైన 22,000కు ఎగువన ఉంది. గత శుక్రవారం మార్కెట్లు రికవరీ కనబరిచినప్పటికీ.. అమెరికా మార్కెట్లు డౌన్‌ట్రెండ్‌ను కనబరచటంతో ఈ వారం మార్కెట్లు అప్రమత్తంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత మద్దతు స్థాయిలైన 22,400 వద్ద కొద్ది రోజుల పాటు నిలదొక్కుకుంటేనే సానుకూల సంకేతాలు వెలువరిస్తుంది. మరోవైపు మిడ్‌క్యాప్ ఇండెక్స్ వీక్లీ ప్రాతిపదికన 5.6 శాతం నష్టంతో 55,800 వద్ద క్లోజైంది. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమై 17,740 వద్ద క్లోజైంది.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ ఏదేనీ అప్రమత్త ట్రెండ్‌తో ప్రారంభమైతే తదుపరి మైనర్ నిరోధ స్థాయి 22,800 ఎగువన ఉంటుంది. సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 23,000.
బేరిష్ స్థాయిలు: నిఫ్టీ మరింత బలహీనతను సూచిస్తే 22,400 దిగువన మద్దతు స్థాయిలు ఉంటాయి. సానుకూలత కోసం ఇక్కడ కన్సాలిడేట్ లేదా నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది. ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి ప్రధాన మద్దతు స్థాయి 22,000 దిగువన ఉంటుంది. స్వల్పకాలిక దిశను తీసుకునే ముందు ఇక్కడ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం ఈ సూచీ 1,550 పాయింట్ల నష్టంతో 54,300 వద్ద క్లోజైంది. ప్రస్తు తం ఈ సూచీ ప్రధాన మద్దతు స్థాయిలైన 54,000కు చేరువలో ఉంది. తదుపరి నిరోధ స్థాయి 55,000. స్వల్పకాలిక సానుకూల ట్రెండ్ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఏదేనీ బలహీనతను సూచిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 53,800 దిగువన ఉంటాయి. ఇక్కడ నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనతను సూచిస్తుంది. అప్రమత్తంగా ఉండాలి.
పాటర్న్: ప్రస్తుతం మార్కెట్ 22,400 వద్ద బహుళ బాటమ్ ప్యాటర్న్‌ను ఏర్పరచుకుంది. 25 రోజుల మూవింగ్ యావరేజీల వద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. సానుకూల దిశ కోసం కొద్ది రోజుల పాటు తప్పనిసరిగా ఇక్కడ నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం సోమవారం, గురువారం రివర్సల్స్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 22,690, 22,800
మద్దతు : 22,400, 22,320
వి. సుందర్ రాజా