ఆచితూచి అడుగేయండి..!
ABN , Publish Date - Feb 23 , 2026 | 04:18 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయటం శుభపరిమాణం అయినప్పటికీ మళ్లీ ప్రత్యేక సుంకాలను...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమ ధోరణిలో సాగే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయటం శుభపరిమాణం అయినప్పటికీ మళ్లీ ప్రత్యేక సుంకాలను విధించటం అనిశ్చితికి దారితీసింది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొనటం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు సూచీలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మదుపరులు ఎంపిక చేసిన షేర్లలో జాగ్రత్తంగా మదుపు చేయటం మంచిది. కచ్చితమైన స్టాప్‌లా్‌సను మెయింటెయిన్ చేయాలి. లేదంటే దీర్ఘకాలిక దృక్పథంతో పెట్టుబడులు పెట్టాలి.
స్టాక్ రికమండేషన్స్
హ్యుండయ్ మోటార్స్: జీవితకాల గరిష్ఠం తర్వాత 25 శాతం మేర దిద్దుబాటుకు లోనైన ఈ కౌంటర్ తాజా ఆర్థిక ఫలితాల తర్వాత టర్న్ అరౌండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ షేరు రూ.2,200 స్థాయిలో కన్సాలిడేటెడ్ అవుతోంది. రిలేటివ్ స్ట్రెంత్ క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం భారీ వాల్యూమ్‌తో రూ.2,293 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,280 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.2,430 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,220 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
కెనరా బ్యాంక్: గత ఏడాది మార్చి నుంచి అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయికి సమీపంలో కదలాడుతోంది. మూమెంటమ్ లభిస్తే దాన్ని అధిగమించి మరింత ముందుకు సాగే అవకాశం ఉంది. గరిష్ఠ స్థాయిల్లో అక్యుములేషన్ కొనసాగుతోంది. నిఫ్టీతో పోల్చితే జోరు ప్రదర్శిస్తోంది. గత శుక్రవారం రూ.154 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.150 ఎగువన ఎంటరై రూ.225 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.144 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
జేఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ: కొన్ని నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తున్న ఈ షేరు ప్రస్తుతం రూ.480 మద్దతు స్థాయి వద్ద కదలాడుతోంది. తాజా ఫలితాల తర్వాత కొంత మూమెంటమ్ పెరిగింది. గత శుక్రవారం రూ.493 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.480 ఎగువన పొజిషన్ తీసుకుని రూ.550 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.450 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎన్‌టీపీసీ: ఈ ఏడాది ఆరంభం నుంచి ఈ షేరు 17 శాతం మేర రాణించింది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు చక్కని బేస్ ఏర్పడింది. ప్రస్తుతం కీలక నిరోధ స్థాయి రూ.372కి చేరింది. దీన్ని అధిగమిస్తే లాంగ్ టర్మ్ బుల్లిష్ ట్రెండ్ మొదలవుతుంది. గత శుక్రవారం రూ.372 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.370 ఎగువన ప్రవేశించి రూ.440 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.355 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
ఎస్‌బీఐ లైఫ్: ఏడాది కాలంలో 56 శాతం రాబడిని అందించిన ఈ షేరు ప్రస్తుతం జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతోంది. స్వల్ప పుల్‌బ్యాక్ తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. రిలేటివ్ స్ట్రెంత్ బాగుంది. గత శుక్రవారం రూ.2,080 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,050 వద్ద పొజిషన్ తీసుకుని రూ.2,200 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ.2,000 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
రణ్‌వీర్ సింగ్‌కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్