Share News

ఐపీఓల్లో పబ్లిక్‌కు మరిన్ని షేర్లు

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:01 AM

ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్‌, నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి...

ఐపీఓల్లో పబ్లిక్‌కు మరిన్ని షేర్లు

నిబంధనలు మార్చిన ఆర్థిక మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీ: ఐపీఓలకు వచ్చే కంపెనీలు రిటైల్‌, నాన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లు, సంస్థాగత మదుపరులకు షేర్లు కేటాయించే విధానాన్ని ప్రభుత్వం మార్చింది. దీనికి సంబంధించి కేంద్రఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం..

  • ఐపీఓ తర్వాత రూ.1,600 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల మూలధనం ఉండే కంపెనీల ఈక్విటీల్లో పబ్లిక్‌ వాటా మూడేళ్లలో కనీసం 25ు ఉండాలి.

  • ఈ ఇష్యూల్లో కనీసం 2.5ు షేర్లు లేదా కన్వర్టబుల్‌ డిబెంచర్లను పబ్లిక్‌కు కేటాయించాలి.

  • ఐపీఓ తర్వాత రూ.1,600 కోట్ల వరకు ఈక్విటీ ఉన్న కంపెనీలు, తమ షేర్లు లేదా కన్వర్టబుల్‌ డిబెంచర్లలో కనీసం 25 శాతం పబ్లిక్‌కు జారీ చేయాలి.

  • లిస్టింగ్‌ తర్వాత ఈక్విటీ రూ.1,600 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల లోపు ఉన్న కంపెనీలు కనీసం రూ.4,000 కోట్లవిలువైన షేర్లను పబ్లిక్‌కు జారీ చేయాలి.

  • లిస్టింగ్‌ తర్వాత రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీలు తమ ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టబుల్‌ డిబెంచర్లలో కనీసం 10ు పబ్లిక్‌కు జారీ చేయాలి.

  • ఐపీఓల తర్వాత రూ.5,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల లోపు ఈక్విటీ ఉన్న కంపెనీలైతే తమ ఈక్విటీలో కనీ సం రూ.1,000 కోట్ల విలువైన షేర్లను లేదా ఎనిమిది శాతం షేర్లు లేదా కన్వర్టబుల్‌ డిబెంచర్లను పబ్లిక్‌కు జారీ చేసి ఆ తర్వాత ఐదేళ్లలో ఈ వాటాను 25 శాతానికి పెంచాలి.

  • ఐపీఓ తర్వాత రూ.లక్ష కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీలు కనీసం రూ.6,250 కోట్ల విలువైన షేర్లతో పాటు, షేర్లు, కన్వర్టబుల్‌ డిబెంచర్లలో 2.5 శాతం పబ్లిక్‌కు జారీ చేయాలి.

  • లిస్టింగ్‌ సమయంలో సగటు ఇన్వెస్టర్ల వాటా 15ు లోపు ఉన్న కంపెనీలు ఆ వాటాను ఐదేళ్లలో 15 శాతానికి, పదేళ్లలో 25 శాతానికి పెంచాలి.

  • లిస్టింగ్‌ సమయంలో 15 శాతానికి మించి ప్రజల వాటా ఉన్న కంపెనీలు ఐదేళ్లలో ఆ మొత్తాన్ని 25 శాతానికి పెంచాలి.

  • ఈ నిబంధనలు పాటించని కంపెనీలపై జరిమానాలు విధించే అధికారం సెబీకి అప్పగింత.

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 01:02 AM