Share News

ఎఫ్‌పీఐల ఉపసంహరణ రూ.1.14 లక్షల కోట్లు

ABN , Publish Date - Mar 30 , 2026 | 02:34 AM

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీ ఎత్తున నిధులు తరలించుకుపోయారు. శుక్రవారం వరకు వారు తరలించుకుపోయిన...

ఎఫ్‌పీఐల ఉపసంహరణ రూ.1.14 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మార్చి నెలలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి భారీ ఎత్తున నిధులు తరలించుకుపోయారు. శుక్రవారం వరకు వారు తరలించుకుపోయిన మొత్తం రూ.1.14 లక్షల కోట్లకు చేరింది. ఒక నెలలో ఇంత భారీగా వారు అమ్మకాలు సాగించడం ఇదే ప్రథమం. 2024 అక్టోబరులో నమోదైన రికార్డు ఉపసంహరణ రూ.94,017 కోట్లను ఇది అధిగమించింది. పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత, భారత వృద్ధిరేటుపై క్రూడాయిల్‌ ధర పెరుగుదల ప్రభావం వంటివి వారి నిధుల ఉపసంహరణకు కారణాలని అంటున్నారు. మంగళవారం మహావీర్‌ జయంతి సెలవు దినం కావడం వల్ల మార్చి నెలలో సోమవారం ఒక్క రోజు ట్రేడింగ్‌ మిగిలి ఉంది. మార్చి నెల మొత్తం ఎఫ్‌పీఐలు నిధులు తరలించుకుపోతూనే ఉన్నారు.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 30 , 2026 | 02:34 AM