Share News

చల్లబడిన ముడిచమురు

ABN , Publish Date - May 26 , 2026 | 05:34 AM

అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల నేపథ్యంలో నెలకొన్న సానుకూల వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ...

చల్లబడిన ముడిచమురు

సెన్సెక్స్‌ 1,074 పాయింట్లు అప్‌

ముంబై: అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చల నేపథ్యంలో నెలకొన్న సానుకూల వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ నెలకొనడంతో పాటు ముడిచమురు ధరలు దిగిరావడంతో దేశీయ ప్రామాణిక ఈక్విటీ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా పెరిగాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటంతో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ షేర్లలో కొనుగోళ్లు కూడా సూచీలు దూసుకుపోవడానికి దోహదపడ్డాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 1,073.61 పాయింట్ల లాభంతో 76,488.96 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 1,143.72 పాయింట్ల మేర పెరిగింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 312.40 పాయింట్లు పెరిగి 24,031.70 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 26 , 2026 | 05:34 AM