ఆద్యంతం ఊగిసలాటే...
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:51 AM
అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రామాణిక ఈక్విటీ సూచీలు లాభ, నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి....
739 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్
ముంబై: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రామాణిక ఈక్విటీ సూచీలు లాభ, నష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో 739 పాయింట్ల శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 26.76 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 78,520.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 11.30 పాయింట్ల వృద్ధితో 24,364.85 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 12 రాణించగా.. ట్రెంట్ షేరు 3.33 శాతం ఎగబాకి సూచీ టాప్ గెయినర్‌గా నిలిచింది. బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్, మిడ్‌క్యాప్ సెలెక్ట్ సూచీలు 0.15 శాతం వరకు నష్టపోయాయి. రంగాలవారీ సూచీల్లో పవర్ 1.24 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా ఉంది.
డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసల నష్టంతో రూ.93.16 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర ఒకదశలో 97.50 డాలర్లకు ఎగబాకింది.
ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.4,300 పెరిగి రూ.2,57,300కు చేరుకోగా.. మేలిమి బంగారం 10 గ్రాము ల రేటు రూ.800 ఎగబాకి రూ.1.57 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్(31.10 గ్రాములు) గోల్డ్ ఒకదశలో 4,805 డాలర్లు, సిల్వర్ 79.71 డాలర్ల స్థాయిలో ట్రేడయ్యాయి.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News