Share News

Sensex Down: మార్కెట్‌ మళ్లీ వెనకడుగు

ABN , Publish Date - Jan 14 , 2026 | 05:50 AM

ఈక్విటీ మార్కెట్‌ మళ్లీ నష్టాల బాట పట్టింది. రికవరీ ఒక రోజు ముచ్చటగానే నిలిచిపోయింది. టారిఫ్‌ సంబంధిత ఆందోళనల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఎల్‌ అండ్‌ టీ, భారతి ఎయిర్‌టెల్‌...

Sensex Down: మార్కెట్‌ మళ్లీ వెనకడుగు

  • సెన్సెక్స్‌ 250 పాయింట్లు డౌన్‌

ముంబై: ఈక్విటీ మార్కెట్‌ మళ్లీ నష్టాల బాట పట్టింది. రికవరీ ఒక రోజు ముచ్చటగానే నిలిచిపోయింది. టారిఫ్‌ సంబంధిత ఆందోళనల నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఎల్‌ అండ్‌ టీ, భారతి ఎయిర్‌టెల్‌ కౌంటర్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల సీజన్‌ నిరాశాజనకంగా ప్రారంభం కావడం, విదేశీ నిధుల తరలింపు సైతం ఇన్వెస్టర్లను అమ్మకాల వైపు పురిగొల్పాయి. తీవ్ర ఆటుపోట్లతో సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దఽశలో 615.38 పాయింట్ల వరకు దిగజారి కనిష్ఠ స్థాయి 83,262.79ని తాకింది. కాని చివరి గంటలో సాగిన కొనుగోళ్ల మద్దతుతో నష్టాన్ని 250.48 పాయింట్లకు కుదించుకుని 83,627.69 వద్ద ముగిసింది. నిఫ్టీ 57.95 పాయింట్ల నష్టంతో 25,732.30 వద్ద క్లోజయింది.

బీసీసీ ఇష్యూకి భలే ఆదరణ: కోల్‌ ఇండియా అనుబంధ సంస్థ భారత్‌ కోకింగ్‌ కోల్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్లు బ్రహ్మరధం పట్టారు. బిడ్డింగ్‌ చివరి రోజు ముగిసే సమయానికి ఆ ఇష్యూ 76.81 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది.

‘సిప్‌’లకు ఇన్వెస్టర్లు బ్రహ్మరథం

గత ఏడాది ఇన్వెస్టర్లు క్రమానుగత పెట్టుబడి ప్లాన్లకు (సిప్‌) బ్రహ్మరథం పట్టారు. 2025 సంవత్సరంలో సిప్‌లలోకి రూ.3.34 లక్షల కోట్లు వచ్చాయి. సిప్‌ పెట్టుబడులు 2024లో రూ.2.68 లక్షల కోట్లు కాగా, 2023లో రూ.1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు మార్కెట్లో ఏర్పడిన కరెక్షన్లను మరింత పెట్టుబడి అవకాశాలుగా మలుచుకున్నారనేందుకు ఇది సంకేతమని భారత మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల సంఘం (ఏఎంఎఫ్‌ఐ) పేర్కొంది. మార్కెట్లో ఎగుడు దిగుడులతో సంబంధం లేకుండా రూపాయి విలువ సగటు విధానంలో సిప్‌లు నిలకడగా రాబడులు అందించడం ఇందుకు కారణమని విశ్లేషకులంటున్నారు.

ఇవీ చదవండి:

అల్‌ ఫలా వర్సిటీ క్యాంపస్‌ అటాచ్‌!

వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!

Updated Date - Jan 14 , 2026 | 05:50 AM