Share News

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు

ABN , Publish Date - Apr 13 , 2026 | 10:04 AM

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ నష్టాలతో మొదలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర కూడా ఎగబాకింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. నష్టాల్లో సూచీలు
Sensex Nifty

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగడంతో సోమవారం స్టాక్ మార్కెట్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే సెన్సెక్స్ భారీ స్థాయిలో పతనమైంది. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 1,524 పాయింట్ల నష్టంతో 76,026 వద్ద కొనసాగుతోంది. ఇక నిఫ్టీ కూడా 460 పాయింట్ల మేర కోల్పోయి 23,590 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో కోల్‌ఇండియా షేర్లు లాభాల్లో ఉండగా బజాబ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

ఇక ఆసియా మార్కెట్స్ కూడా నేడు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 102 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.31గా ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

ఈ ఏడాది 25,000 మంది ఫ్రెషర్ల నియామకం: టీసీఎస్‌ ఎండీ కృతివాసన్‌

తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు.. 10 రోజుల్లో రూ.48,213 కోట్లు వెనక్కు..

Updated Date - Apr 13 , 2026 | 10:23 AM