Share News

రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ABN , Publish Date - Nov 19 , 2026 | 02:37 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో రెండు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో...

రెండు రోజుల ర్యాలీకి బ్రేక్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో రెండు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో బేరిష్‌ ట్రెండ్‌, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న భయాల నేపథ్యంలో కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్‌ 500.38 పాయింట్లు నష్టపోయి 82,031.81 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సూచీ 751.72 పాయింట్లు కోల్పోయి 81,780.47 స్థాయికి దిగజారింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 159.45 పాయింట్ల నష్టంతో 25,227.95 వద్ద క్లోజైంది.

ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 19 , 2026 | 02:37 AM