Share News

కుప్పకూలిన మార్కెట్స్.. భారీ నష్టాలు!

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:03 PM

గల్ఫ్‌లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారవచ్చన్న అంచనాల నడుమ నేడు దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ నష్టాలను చవిచూశాయి. నిఫ్టీ 488 పాయింట్ల మేర సెన్సెక్స్ 1635 పాయింట్ల మేర పతనమయ్యాయి.

కుప్పకూలిన మార్కెట్స్.. భారీ నష్టాలు!
Sensex Nifty Crash on Monday

ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత ముదరవచ్చన్న భయాల నడుమ సోమవారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 1635.67 పాయింట్ల మేర పతనమై 71,947.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 488.20 పాయింట్ల మేర తగ్గి 22,331.40 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2.6 శాతం మేర పతనమయ్యాయి. ఆటో, ఎఫ్ఎమ్‌సీజీ, టెలికం, రియల్టీ, ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు నేడు 2-4 శాతం మేర నష్టాలను మూటగట్టుకున్నాయి.


నేటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఒకానొక దశలో 95.12 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి తాకింది. చివర్లో కాస్త కోలుకుని 94.83 డాలర్ల వద్ద ముగిసింది. చమురు ధరలు మళ్లీ ఆకాశాన్నంటడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. కొన్ని రోజుల క్రితం 100 డాలర్‌ మార్కు దిగువకు చేరిన బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర ప్రస్తుతం 115 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధర 120 డాలర్లకు చేరవచ్చనే అంచనాలు కూడా మార్కెట్ వర్గాలను కలవరపెడుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి:

ఎఫ్‌పీఐల ఉపసంహరణ రూ.1.14 లక్షల కోట్లు

సబ్సిడీల భారం తడిసి మోపెడు

Updated Date - Mar 30 , 2026 | 04:19 PM