2026-27లో రూ.24,000 కోట్ల ప్రీమియం వసూళ్లు లక్ష్యం
ABN , Publish Date - May 06 , 2026 | 04:35 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.24,000 కోట్ల ప్రీమియం వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ...
స్టార్ హెల్త్ ఎండీ ఆనంద్ రాయ్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.24,000 కోట్ల ప్రీమియం వసూళ్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు స్టార్ హెల్త్ అండ్ అల్లైడ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈఓ ఆనంద్ రాయ్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పోలిస్తే ఇది రూ.3,600 కోట్లు ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి తమ స్థూల ప్రీమియం వసూళ్లు రూ.30,000 కోట్లకు చేరే అవకాశం ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరం (2025-26) కంపెనీ దేశవ్యాప్తంగా వసూలు చేసిన రూ.20,400 కోట్ల ప్రీమియంలో రూ.2,268 కోట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సమకూరింది. తమ కంపెనీ ప్రీమియం వసూళ్ల వృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలది కీలకపాత్ర అని ఆనంద్ రాయ్ చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఈ రెండు రాష్ట్రాల్లో తమ వ్యాపార వృద్ధి రేటు కూడా ఎక్కువన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఏపీ, తెలంగాణల్లో 1.8 లక్షల ఆరోగ్య బీమా పాలసీల క్లెయిమ్‌లను పరిష్కరించి పాలసీదారులకు రూ.1,254 కోట్లు చెల్లించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 24 శాతం ఎక్కువని రాయ్ చెప్పారు. వ్యాపార వృద్ధి కోసం ఇక నాన్ మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నట్టు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్