Share News

డీల్‌ విలువ రూ.378 కోట్లు

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:26 AM

తూర్పుగోదావరి జిల్లా చాగల్లు కేంద్రంగా ఉన్న జైపూర్‌ షుగర్‌ కంపెనీని.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్‌ అసెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ...

డీల్‌ విలువ రూ.378 కోట్లు

స్టాండర్డ్‌ అసెట్స్‌ చేతికి చాగల్లు షుగర్స్‌

చాగల్లు (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా చాగల్లు కేంద్రంగా ఉన్న జైపూర్‌ షుగర్‌ కంపెనీని.. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్‌ అసెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేజిక్కించుకుంది. సుమారు 9 ఏళ్ల క్రితం మూతపడిన ఈ కంపెనీని స్టాండర్డ్‌ అసెట్స్‌ రూ.378 కోట్లకు కొనుగోలు చేసింది. జైపూర్‌ షుగర్‌ కంపెనీ ఆధ్వర్యంలో చాగల్లు వీవీఎస్‌ షుగర్స్‌, చాగల్లు డిస్టిలరీ యూనిట్‌, జంగారెడ్డిగూడెం శ్రీరమా డిస్టిలరీస్‌, పోతవరం షుగర్‌ ఫ్యాక్టరీ, రాయగడ షుగర్‌ కర్మాగారం ఉన్నాయి. వీటన్నింటిలో మొత్తం 1,053 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేసేవారు. తాజాగా చాగల్లు షుగర్స్‌ను స్టాండర్డ్‌ అసెట్స్‌ కొనుగోలు చేయటంతో ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సంస్థలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వేతన బకాయిలు సహా ఇతర చెల్లింపుల ప్రక్రియ గత మూడు రోజులుగా జరుగుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

టాటా సన్స్‌ కొత్త చైర్మన్‌ ఎంపిక ప్రక్రియ షురూ

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్‌ జీఈసీ

Updated Date - Aug 16 , 2026 | 05:26 AM