హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ జీఈసీ
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:57 AM
అమెరికాకు చెందిన ప్రముఖ డీప్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సంస్థ క్లౌడ్‌యాంగిల్స్.. హైదరాబాద్‌లో...
హైదరాబాద్: అమెరికాకు చెందిన ప్రముఖ డీప్‌టెక్, ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సంస్థ క్లౌడ్‌యాంగిల్స్.. హైదరాబాద్‌లో తమ గ్లోబల్ ఇంజనీరింగ్ సెంటర్(జీఈసీ)ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అంతర్జాతీయ మార్కెట్లకు అవసరమైన అత్యాఽఽధునిక సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని.. వచ్చే రెండేళ్లలో దాదాపు 1,000 మంది ఇంజనీర్లకు పెంచుతూ సామర్థ్యాన్ని మరింత విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ కేంద్రం ద్వారా డిజిటల్ టెక్నాలజీ, అప్లికేషన్ డెవల్‌పమెంట్, ఇంజనీరింగ్, డేటా అండ్ అనలిటిక్స్, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ప్రొడక్టివిటీ, ఇన్నోవేషన్, కార్పొరేట్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో క్లౌడ్‌యాంగిల్స్ సేవలను అందించనుంది. ఈ నెల 11న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ జీఈసీని ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..